అమరావతిలో ల్యాండ్ మాఫియాలో మంత్రి నారాయణ చుట్టూ వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. 3 వేల ఎకరాలకు పైగా భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేశారంటూ వైసీపీ గొంతు అయిన సాక్షి పత్రిక - ఛానల్ కథనాలు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.... ఆ బినామీల్లో పొత్తూరు ప్రమీల అనే పేరు వినిపిస్తోంది... ఆమె మంత్రి నారాయణకు సన్నిహితురాలంటూ సాక్షి ఛానల్ కథనాల్లో పేర్కొంటున్నారు. ఇంతకీ... ఎవరీ ప్రమీల? ఏమిటా సాన్నిహిత్యం? ఆమె పేరుతో బినామీ ఆస్తులను కొనుగోలు చేసినంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడిందని పలువురు చర్చించుకుంటున్నారు.
మంత్రి నారాయణకు బినామీ వ్యవహరించిన వారిలో కొందరు అంటూ ముగ్గురు పేర్లను కూడా ప్రచురించారు. ఆకుల మునిశంకర్ - రావూరు సాంబశివరావు - పొత్తూరి ప్రమీల పేర్లతో భారీగా నారాయణ భూములు కొనుగోలు చేశారు. మంత్రి నారాయణకు స్వయానా బావమరిది రావూరు సాంబశివరావు పేరుతో తుళ్లూరు మండలం మందడంలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అద్దె ఇంట్లో ఉండే మంత్రి నారాయణ దూరపు బంధువు మునిశంకర్ కూడా అమరావతితో భారీగా భూములు కొనుగోలు చేశారు.
నారాయణ బినామీల జాబితాలో ప్రమీల అనే మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమె పేరుతోనూ భారీగా భూములు కొన్నారని ఆరోపణలున్నాయి. ప్రమీల నారాయణకు అత్యంత సన్నిహితురాలని చెబుతున్నారు. కర్ణాటక - తమిళనాడుల్లో నారాయణ కాలేజీల వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రమీల ఆదాయం అంతంత మాత్రమేనని తెలుస్తోంది. సాధారణ కుటుంబానికి చెందిన ప్రమీలకు కోట్లాది రూపాయల విలువైన రాజధానిలో భూములు కొనుగోలు చేయడం చర్చనీయాంశమవుతోంది. తమిళనాడు - కర్ణాటకల్లో నారాయణ కళాశాలల వ్యవహారాలు చూసే ప్రమీల నారాయణకు అత్యంత నమ్మకస్థురాలని చెబుతున్నారు.