తన ఆర్థిక శక్తితో వచ్చిన అహంతోనే నారాయణ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు.. అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. విపరీత స్థాయిలో ఆర్థిక శక్తి కలిగిన నారాయణకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నారాయణకు కోరిన పదవిని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సదా సిద్ధంగానే ఉంటారు. గత ఎన్నికల ముందు ఎక్కడా పైకి అలజడి చేయని నారాయణకు టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి దక్కింది - మంత్రి పదవి కూడా దక్కేసింది. అది కూడా కీలకమైన పదవి.
రాజధాని విషయంలో అంతా తానై నడిపించారీయన. ఇలాంటి నేపథ్యంలో నారాయణ ఎమ్మెల్సీగా కొనసాగడం కష్టం కాదు. అయితే ఆయనకు మాత్రం అలా ఉండాలని అనిపించలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చూపించడానికి అంటూ.. నెల్లూరు అర్బన్ సీటును లక్ష్యంగా చేసుకుని చాలా కాలం నుంచి పని చేస్తూ వస్తున్నారు. కోరినట్టుగా ఆయనకు టీడీపీ టికెట్ కూడా ఖరారు అయ్యింది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటి? అంటే.. పరిణామాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయని తెలుస్తోంది. అత్యంత భారీగా ఖర్చు పెట్టగల నారాయణకు అక్కడ ఎదురుగాలి వీస్తోందని సమాచారం. ప్రత్యేకించి రాజకీయ పరిణామాలు అలా ఉన్నాయట.
నెల్లూరు అర్బన్ లో యాదవుల జనాభా గట్టిగా ఉంటుంది. ఆ కులం పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గట్టిగా పట్టు సంపాదించుకున్నాడు. పైపెచ్చూ తన లాంటి సామాన్యుడికి కొన్ని వందల కోట్ల అధిపతికి పోరు అని అనిల్ కుమార్ యాదవ్ ప్రచారం చేసుకొంటూ ఉన్నాడు. ఇతర బీసీ వర్గాలను కూడా కలుపుకుపోయేందుకు అనిల్ గట్టిగానే ప్రయత్నిస్తూ ఉన్నాడు.
గత ఎన్నికల్లో తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో అనిల్ గెలిచాడు. ఇప్పుడు ఆనం వర్గం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉండటం అనిల్ కు అనుకూలాంశం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కు పక్షం రోజుల ముందే క్లారిటీ వచ్చిందని - నారాయణకు పరిస్థితి అర్థమైపోయిందనే టాక్ మొదలైంది. నామినేషన్ల దగ్గరే చాలా వరకూ ఊపు అర్థం అవుతుంది నేతలకు. ఇప్పుడు అదే జరుగుతోందని..
నారాయణ అనవసరంగా ప్రయాస పడటాన్ని ఆపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఖర్చు విషయంలో కూడా పంపకాలు ఆగిపోయాని ఆఫ్ ద రికార్డుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవైపు నారాయణ స్కూల్ సిబ్బంది కొందరు నోట్ల పంపకం వ్యవహారంలో దొరికిపోయినట్టుగా వార్తలు వస్తున్ఆనయి. ఇలాంటి నేపథ్యంలో నెల్లూరు రాజకీయం మరింత ఆసక్తిదాయకంగా మారింది.