మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించరన్న పేరుంది. లోపల ఎన్ని చెత్త పనులు చేసినా.. బయటకు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటారన్న పేరుంది. లెక్క తేడా వస్తే పార్టీ అధినేత చంద్రబాబుతో తీవ్రమైన తలనొప్పులు ఖాయమని జాగ్రత్తగా వ్యవహరిస్తంటారు.
తాజాగా అమలాపురం ఎంపీ పి. రవీంద్రబాబు ఒక విషయంలో దొరికిపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో అగ్గిపెట్టెతో వెళ్లి తనిఖీల్లో దొరికిపోయారు. ఈ విషయాన్ని సింపుల్‌గా మర్చిపోయాను..అన్న మాట చెప్పేసి ఉంటే అక్కడితో వదిలిపోయేదే. కానీ.. రవీంద్ర దాన్నో ఇష్యూగా మార్చటంతో.. ఆ విషయం మీడియా వరకూ వచ్చిన పరిస్థితి.
ఈ నేపథ్యంపై ఇంగ్లిష్ ఛానల్ ఒకటి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి సదరు ఎంపీతో పాటు.. పలువురు ప్రముఖుల్ని పిలిచారు. అలా వచ్చిన వారిలో రిటైర్డ్ ఆర్మీ అధికారి ఒకరు. ఇక్కడే సదరు చర్చా కార్యక్రమం గురించి చెప్పాలి. మామూలుగానే తన చర్చా కార్యక్రమాల్లో విరుచుకుపడే టైమ్స్ నౌ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ ఆద్నాబ్.. తాజా ఉదంతంతో వీర లెవల్లో వాయించేశారు.
ఈ సందర్భంగా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ఎంపీగారి బాధ్యతారాహిత్యాన్ని విమర్శించారు. అంతే.. ఎంపీకి వీర లెవల్లో కోపం వచ్చేసింది. సబ్సిడీ మీద ఇచ్చే లిక్కర్ కోసం.. ఫ్రీగా ఇచ్చే పుడ్డు కోసం ఆర్మీలో చేరే వారు నాకు సలహాలు ఇవ్వటం ఏమిటి ఛండాలంగా.. నేను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని అన్న బిల్డప్ ఇచ్చారు. ఎంపీ ప్రవర్తనతో ఆ చర్చా కార్యక్రమానికి వచ్చిన వాంతా ఎంపీగారి దూకుడ్ని తిట్టి పోసినంత పని చేశారు. సారీ చెప్పాలన్నా కుదరదంటే కుదరదని తేల్చేశాడు. ఈ విషయం టీవీ లైవ్‌లో జరగటంతో తమ్ముళ్ల నోటి దురుసుతనం దేశవ్యాప్తంగా తెలిసినట్లు అయ్యింది. ఈ వ్యవహారంపై బాబు కూడా గుస్సా అయినట్లుగా చెబుతున్నారు. ఇలా అర్థం పర్థం లేకుండా నోరు జారే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది.