ఆ ఫుడ్ తిన్నా.. ఈ నీళ్లు తాగినా ఖతమే.!

Update: 2019-12-09 01:30 GMT
ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్సే.. ఉద్యోగులు టిఫిన్లు పట్టుకొని ఓ ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తీసుకొని ఆఫీసులకు వెళుతుంటారు.ఇక పనిచేసే చోటా అంతా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు..  అన్నం తినే ప్లేటు ప్లాస్టిక్, తాగే బాటిల్, ప్యాక్ చేసే ఆహారం కూడా ప్లాస్టిక్ డబ్బాలోనే.. ఇలా మన జీవితంలో ప్లాస్టిక్ లేనిదే ఆహారం, నీరు సమకూర్చుకోలేని పరిస్థితి.

అయితే ఈ ప్లాస్టిక్ లలో తినడం.. తాడం వల్ల మనకు తెలియకుండా శరీరంలోకి ప్లాస్టిక్ సూక్ష్మ కణాలు చేరిపోతున్నాయని అమెరికన్ పరిశోధకుల పరిశోధనలో తేలింది. కొంత మంది మూత్ర నమూనాలు పరిశీలించగా వారి మూత్రంలో 44 రెట్లు ఎక్కువగా ప్లాస్టిక్ సూక్ష్మ కణాలు కనిపించాయి. దీని కారణంగా సంతానోత్పత్తి, మెదడు పనితీరు దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల మన శరీరానికి ముప్పు అంటున్నారు.

ఇక భారత్ లో లభిస్తున్న ప్యాకేజ్డ్ ఫుడ్స్, డ్రింక్స్ లో ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్నాయని వీటిని తింటే తొందరలోనే పోతారని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో నిగ్గుతేల్చింది. ప్యాకేజ్డ్ ఫుడ్ లో ఇంగ్లండ్ దేశంలో అత్యంత నాణ్యతను పాటిస్తుందని తేల్చింది. చిట్టచివరి స్థానంలో భారత్ నిలవడం విశేషం. సో భారత్ లో ప్యాకేజ్డ్ ఫుడ్ తింటే ఉబకాయం, గుండె జబ్బులు, ఇతర రోగాలు చుట్టుముడుతాయని అధ్యయనంలో తేలింది.
Tags:    

Similar News