అనుకోని అతిథిలా.. పిలవని పేరంటంలా తెలంగాణ రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చారు వైఎస్పాఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ల కాలంలో ఏనాడూ ఇక్కడి పరిస్థితులు, రాజకీయాలపై మాట్లాడని ఆమె.. ఇప్పుడు ఏకంగా పార్టీ పెట్టి హడావుడి చేస్తున్నారు. సొంత అన్న వైఎస్ జగన్ ఏపీలో సీఎంగా ఉండగా, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఏమిటో తొలుత ఎవరికీ అర్ధం కాలేదు. ఓ దశలో షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో పావులా వాడుకుంటున్నారన్న విమర్శలు వచ్చాయి. ఆమె వెనుక బీజేపీ ఉన్నదని కొందరు, జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమ్మక్కయి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు షర్మిలను తెలంగాణలోకి తీసుకొచ్చారన్న ఆరోపణలు వినింపిచాయి. వీటి సంగతలా ఉంచితే.. షర్మిల వస్తూనే తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలకు దిగారు. బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నా.. అదంత బలంగా ఏమీ లేదు.
మరోవైపు వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సెంటిమెంట్ నుంచి పాదయాత్ర కూడా ప్రారంభించారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో సాగుతోంది. అసలు ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి రావడం ఏమిటో.. తండ్రి, అన్నలా పాదయాత్ర చేయడం ఏమిటో ఎవరికీ తెలియని పరిస్థితి. అన్నిటికి మించి జగన్ తో విభేదాలు ఎందుకు వచ్చాయో ఆమె ఈ ఆర్నెల్లలో ఎన్నడూ సూటిగా చెప్పింది లేదు. ఒకటీ అరా మీడియా సంస్థలకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఏ విషయమూ కొత్తగా లేదు. దీంతో ఆమె తీరును చూసి అందరూ ఓ కామెడీ పీస్ గా భావిస్తున్నారు. ఇక ఈ విషయంలో వస్తున్న సెటైర్లకు అంతే ఉండడం లేదు.
అదే ఆమెకు ప్రతిబంధకం
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసిన షర్మిల.. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఆమె ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? అది కూడా ఏమాత్రం సంబంధం లేని తెలంగాణలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేదాని మీద అందరికీ అనుమానాలున్నాయి. రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల చెబుతున్నప్పటికీ అదేదో ఏపీలోనే చేయొచ్చు కదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవానికి ఎంతో ప్రేమించే సోదరుడు జగన్ తో ఎందుకు విభేదాలు వచ్చాయి? అనేదానిపై షర్మిల వివరణ ఇస్తే కొంతైనా ఆమె మాటలు కొంతైనా నమ్మేందుకు ఆస్కారం ఉండేది.
షర్మిల పాదయాత్రా..? ఎక్కడా?
అనేకానేక సంశయాలు, సందేహాల మధ్య తెలంగాణలో మొదలైన వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు షర్మిల రాజకీయ ప్రస్థానం పాదయాత్రతో మరో మెట్టు ఎక్కుతుందని భావించారు. అయితే, షర్మిల ఎంతగా తాపత్రయ పడుతున్నా.. జనంలో స్పందన కరువైందనే చెప్పాలి. అసలు ఆమె ఉద్దేశం ఏమిటో అర్థం కాని రీతిలో పాదయాత్ర సాగుతుండడమే దీనికి కారణం. చేవెళ్ల నుంచి మొదలై ప్రస్త్తుతం నల్లగొండ జిల్లాకు చేరిన పాదయాత్రలో షర్మిలకు దక్కుతున్న ఆదరణ అంతంతే.
తల్లి వైఎస్ విజయమ్మ మధ్యమధ్యలో వచ్చి వెళ్తూ బిడ్డను చూడడంతో పాటు ఆమె పాదయాత్ర గురించి గొప్పగా చెబుతున్నప్పటికీ అది తెలంగాణ ప్రజలకు అప్రస్తుతమే అవుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల పాదయాత్రను ఎవరూ సీరియస్ అంశంగా తీసుకోవడం లేదు. ఉదాహరణకు షర్మిల నల్లగొండ జిల్లా పాదయాత్రను చూస్తే ఆమె వెంట కనీసం పది, ఇరవై మంది కూడా ఉండడం లేదు.
వైఎస్ కు ఆదరణ ఉన్న జిల్లాల్లోనే ఇలాగైతే..
నిజానికి చెప్పాలంటే రంగారెడ్డి, నల్లగొండ రెండూ దివంగత సీఎం వైఎస్సార్ కు మంచి ఆదరణ ఉన్న జిల్లాలు. ఈ జిల్లాల్లో సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి కుటుంబాలను వైఎస్ రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహించారు. ఆ లెక్కన వైఎస్సార్ కుమార్తెగా.. షర్మిల ఇలాంటి జిల్లాల్లో పాదయాత్ర చేపడితే భారీ స్పందన రావాలి. కానీ, ఇప్పటివరకు చూస్తే షర్మిల పాదయాత్రకు అంత సీన్ లేదని తెలిసిపోతోంది. వైఎస్ అభిమాన నాయక గణం దండిగా ఉన్న ఈ జిల్ల్లాల్లోనే ఇలా ఉంటే వరంగల్, కరీంనగర్ వంటి కరుడుగట్టిన తెలంగాణ వాదులున్న జిల్లాల్లో పరిస్థితి కష్టమేనని చెప్పొచ్చు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినా
జీవించి ఉన్నన్నాళ్లు తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిన వైఎస్సార్ కుమార్తెగా షర్మిలను తెలంగాణ ప్రజలు భావించడంలో ఎలాంటి తప్పులేదు. వైఎస్ సంక్షేమ పథకాలు అనేది పాతమాట. ఆయన చనిపోయి 12 ఏళ్లు దాటింది. ఉమ్మడి రాష్ట్రంలో అయిదేళ్లు, తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్లు కాలం గడిచింది. ఈ వ్యవధిలో చాలా జరిగింది. ఇప్పడు షర్మిల కొత్తగా వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ షర్మిల ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారు.
పీకే పక్కకు తప్పుకొన్నట్టేనా?
షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారనగానే ఆమె వెనుక ప్రశాంత్ కిశోర్ (పీకే) టీం ఉన్నదని చెప్పుకొన్నారు. పీకే బ్యాచ్ లో కీలకమైన, తమిళనాడులోని రాజకీయ కుటుంబానికి చెందిన యువతి ఒకరు షర్మిలకు రాజకీయ సలహాదారు లేదా వ్యూహకర్తగా వ్యవహరించనున్నారని వార్తలు వచ్చాయి. కాగా, ఇప్పడు వారెవరూ షర్మిలతో లేరని తెలుస్తోంది. కొందరైతే పీకే బ్యాచ్ షర్మిలకు బైబై చెప్పిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు పార్టీల దూకుడుతో వేడెక్కిన తెలంగాణ రాజకీయాల్లో షర్మిల విజయవంతం కావడం అనుమానమే.