ఆయ‌న దృష్టిలో కేటీఆర్ ఇంకా చాక్లెట్ బాయే..!

Update: 2016-11-24 11:27 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు - మంత్రి కేటీఆర్ అంటే ప్ర‌త్యేకమైన ఇమేజి ఉంది. రాజ‌కీయాల్లో అన‌తి కాలంలోనే ఎద‌గ‌డం.. డిప్ల‌మ‌సీ - పాల‌నా సామ‌ర్థ్యం - రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు - ఎన్నిక‌ల్లో స‌క్సెస్ వంటి అనేక అంశాల ప్రాతిప‌దిక‌గా ఆయ‌న్ను కేసీఆర్ తో స‌మానంగా పోలుస్తున్నారు. కానీ... టీఆరెస్ సీనియ‌ర్ నేత ప‌ద్మారావు మాత్రం కేటీఆర్ ను చిన్న‌పిల్లాడిని చేసి చాక్లెట్ బాయ్ అనేశారు. దీంతో టీఆరెస్ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నాయి. అయితే... ప‌ద్మారావు వ్యాఖ్య‌లు ఒక స‌ర‌దా సంద‌ర్భంలో చేసిన‌వి కావ‌డంతో అంతా ఆయ‌న మాట‌ల‌తో సర‌దాగా న‌వ్వుకున్నారు.

 తెలంగాణ ఉద్యమం జరుగుతున్న వేళ నమోదైన కేసుల్లో భాగంగా కోర్టుకు హాజరయ్యేందుకు టీఆరెస్ నేత‌లు వెళ్లిన‌ప్పుడు ఈ ఆసక్తికర ఘటన జరిగింది. కోర్టుకు వ‌చ్చిన ప‌ద్మారావు త‌న‌కు బాగా అల‌వాటైన కిళ్లీ న‌ములుతుండ‌డంతో కేటీఆర్ ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చి "చిచ్చా.. జర పాన్‌ - జర్ధాలు తినడం మానేయ‌రాదె" అని అభిమాన‌పూర్వ‌క సలహా ఇచ్చారు. దానికి ప‌ద్మారావు వెంట‌నే త‌న నోట్లోని పాన్ ని బ‌య‌ట‌కు ఉమ్ముతూ... "రామ్ .. నీకేమో ఏ అలవాటు లేదాయె... గందుకే నన్ను పాన్ బంద్ జేయ‌మంటున్న‌వ్.. గీ చాక్లెట్ల‌న్న అల‌వాటు చేసుకో నువ్.." అంటూ కేటీఆర్ కు కొన్ని చాక్లెట్లు ఇవ్వబోయారు. దీంతో అక్కడే ఉన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ - టీఆరెస్ నేత‌లు అంద‌రూ ఒక్క పెట్టున న‌వ్వారు.

సీనియ‌ర్ లీడ‌ర్ అయిన ప‌ద్మారావు నోట్లో ఎప్పుడూ పాన్ ఉంటుంది. అలాగే కేటీఆర్ ఆయ‌న్ను చాలా అభిమానంతో చిచ్చా అని పిలుస్తుంటారు. ప‌ద్మారావు కూడా కేటీఆర్ ను అంద‌రిలా కాకుండా రామ్ అంటూ సొంత త‌మ్ముడిలా పిలుస్తారు. వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఈ ఆస‌క్తిక‌ర సంభాష‌ణ అంద‌రినీ ఆక‌ర్షించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News