వైరస్ దెబ్బకి భారత్ కాళ్ల వద్దకి పాక్ ...!

Update: 2020-05-13 13:30 GMT
ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ఈ మహమ్మారి భయంతో వణికిపోయేలా చేస్తుంది. చైనాలో వెలుగుచూసిన ఈ వైరస్ ..ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ...ప్రస్తుతం ప్రపంచము మొత్తం వ్యాప్తి చెందింది. కాగా, ఈ మహమ్మారి తీవ్రత పాకిస్తాన్ లో కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ తరుణంలో పాక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ లో మహమ్మారి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో .. తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్ నుంచి దిగుమతి చేసుకునే డ్రగ్స్, విటమిన్స్ వంటి మందులు పై నిషేధాన్ని ఎత్తేసింది. ఈ మహమ్మారి వ్యాధి ట్రీట్ ‌మెంట్ ‌లో వాడుకునేందుకు నిషేదాన్ని తొలగించింది.

పాక్ గవర్నమెంట్ రా మెటేరియల్ తో పాటు, మెడిసిన్స్ ను దిగుమతి చేసుకునేందుకు నిషేదాన్ని ఎత్తేసింది కేవలం మహమ్మారి ప్రభావం ఏ మేర ఉంటుందో తెలియకనే అని, ప్రస్తుతానికి పాక్ లో ఎటువంటి మందుల కొరత లేదని ఓ ఇంగ్లీష్ మీడియా రాసుకొచ్చింది. ఆర్టికల్ 370 ప్రకారం.. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా ఏర్పాటు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 2019 ఆగష్టు 9న ఇండియాతో అన్ని వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకుంది.

కానీ, ఇండియా నుంచి క్లియరెన్స్ లో భాగంగా వస్తువులు కొనుగోలు చేయడంతో ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ పాకిస్తాన్ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది. పాకిస్తాన్ మినిస్ట్రీకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఆధారంగా.. పాకిస్తాన్ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పోర్టల్ ద డాన్ విటమిన్లు, డ్రగ్స్, మెడిసిన్ కు సంబంధించిన లవణాలను ఇండియా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు తెలిపింది.
Tags:    

Similar News