సీఎం యోగికి దిమ్మ తిరిగే షాక్.. యూపీలో సర్పంచ్ గా పాక్ మహిళ

Update: 2021-01-01 04:07 GMT
ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం షాకింగ్ గా మారింది. పాకిస్తాన్ కు చెందిన మహిళ ఒకరు గ్రామ సర్పంచ్ గా వ్యవహరిస్తున్న నిజం సంచలనంగా మారింది. దేశంలోని మరే రాష్ట్రంలో ఇలాంటి ఉదంతం చోటు చేసుకున్నా అదో సంగతి. అందుకు భిన్నంగా ఉత్తరప్రదేశ్ లో.. అందునా యోగి ఆదిత్యనాథ్ లాంటి నేత సీఎంగా ఉన్న సమయంలో వెలుగు చూసిన నిజం ఇప్పుడు ప్రకంపనల్ని రేపుతోంది.

కరాచీకి చెందిన బానో బేగం నలభై ఏళల్ క్రితం ఎటా జిల్లాలోని జలేసర్ బ్లాక్ కు చెందిన వ్యక్తిని పెళ్లాడారు. ఇప్పుడామె గ్రామ తాత్కాలిక సర్పంచ్ గా పని చేస్తున్నారు. ఈ విషయం అనూహ్యంగా బయటకు వచ్చింది. దీంతో షాక్ తిన్న అధికారులు విచారణ షురూ చేశారు. వీసా మీద భారత్ కు వచ్చిన ఆమె.. ఇప్పుడు ఏకంగా సర్పంచ్ కావటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

ఈ ఉదంతం బయటకు పొక్కిన వెంటనే సర్పంచ్ గా వ్యవహరిస్తున్న ఆమెను వెంటనే గ్రామ ప్రధాన్ పదవి నుంచి తొలగించి కేసు నమోదు చేశారు. సర్పంచ్ గా ఎన్నిక కావటానికి అవసరమైన ఆధార్ కార్డు.. ఇతర ధ్రువపత్రాలు ఎలా వచ్చాయన్న విషయంతో పాటు.. సర్ప్ంచ్ గా ఎన్నిక కావటంపైనా విచారణ జరిపించాలని జిల్లా పంచాయితీ రాజ్ అధికారి పోలీసుల్ని ఆదేశించారు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.
Tags:    

Similar News