భారత్ పై ప్రతీకారాన్ని అలా తీర్చుకున్న దాయాది

Update: 2016-11-04 04:26 GMT
తప్పులు చేయకున్నా.. తప్పులు చేసినట్లుగా చిత్రీకరించే తత్వం దాయాది పా(పి)కిస్థాన్ కు అలవాటే. రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ.. గూఢాచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు పాక్ రాయబార ఉద్యోగుల అసలు రూపాన్ని ఢిల్లీ పోలీసులు ప్రపంచానికి చూపించారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన పాక్ ఆత్మరక్షణలో పడింది. తనపై భారత్ వేసిన ముద్రను చెరిపే ప్రయత్నంలో భాగంగా.. భారత్ చేసిన తీరులోనే తాజాగా మరో ఆరోపణ చేసింది.

భారత్ కంటే నాలుగు ఆకులు ఎక్కువ‌ చదివినట్లు అనిపించేందుకు వీలుగా.. తమ దేశంలోని రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తించే భారత్ ఉద్యోగుల్లో ఎనిమిది మందిపై గూఢాచార కుట్రదారులన్న ముద్ర వేసింది. వారంతా పాకిస్థాన్ కు వ్యతిరేకంగా విద్రోహ కార్యకలాపాలు చేపడుతున్నట్లుగా ఆరోపించింది. పాక్ ప్రాంతమైన బలూచిస్థాన్.. సింధ్ ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు చేపడుతున్నట్లుగా ఆరోపించింది.

పాకిస్థాన్ ఆరోపణల్ని భారత్ వెంటనే ఖండించటంతో పాటు..  పాక్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని తేల్చింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై పాకిస్థాన్ స్పందిస్తూ.. దౌత్య ముసుగు వేసుకొని.. దౌత్య కార్యకలాపాల పేరిట.. రా.. ఇంటెలిజెన్స్ బ్యూరో.. మీడియా.. ఇన్ఫర్మేషన్ విభాగాలకు చెందిన భారత అధికారులు పాకిస్థాన్ లో తిష్టవేశారంటూ ఆరోపణలు చేసింది. దీంతో.. తమ రాయబార ఉద్యోగులపై చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్ వారిని స్వదేశానికి పిలిపించేయాలని నిర్ణయించింది. తమ వాళ్ల దుర్మార్గం బయటకు వచ్చినంతనే.. కవర్ చేయటంతో పాటు.. అంతర్జాతీయ సమావేశం ముందు  ‘దొందూ దొందే’ అన్న భావన కలిగేలా చేయాలన్న ఆలోచనలో పాక్ ఉన్నట్లుగా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News