ఆకు వెళ్లి ముల్లు మీద పడినా - ముల్లు వెళ్లి ఆకుమీద పడినా బొక్క ఆకుకే అన్న విషయం మనకే కాదు పాకిస్తాన్ కు కూడా తెలుసు. ఏ విషయంలో మన కాలి గోటికి కూడా సరిపోని పాక్.. మన మీద మేకపోతు గాంబీర్యం ప్రదర్శించి డామినేట్ చెయ్యాడనికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకుంది. రెండు రోజుల్లో దేశంలో ఐపీఎల్ సీజన్ మొదలు కాబోతుంది. దీంతో.. మన ఐపీఎల్ ప్రసారాలపై పాకిస్థాన్ లో నిషేధం విధించింది. దీనివల్ల మన ఆదాయాన్ని బీభత్సంగా దెబ్బకొట్టామని సంబరపడిపోతుంది.
పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌ని నిషేధించాలని భారత్ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా మనవాళ్లు ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగారు. అలాగే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ని ఆడకుండా చెయ్యాలని కూడా ట్రై చేశారు. దీంతో తాము కూడా ఏదైనా చెయ్యగలమని నిరూపించుకునేందుకు మన ప్రసారాల్ని వారి దేశంలో రాకుండా చేశారు. దీనివల్ల మన ఐపీఎల్ కు - మన ఆదాయానికి వచ్చిన నష్టమేమి లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఐసీసీ నడుస్తుందంటే దానికి కారణం మన టీమే. ఐసీసీకి వస్తున్న ఆదాయంలో 60శాతం వరకు మన ఇండియా నుంచే వెళ్తుంది. ఐసీసీయే మనల్ని చూసి మూసుకుని కూర్చున్నప్పుడు తొక్కలో పాకిస్తాన్ మనల్ని ఏం చేస్తుంది. కాకపోతే.. అక్కడి పాకిస్థాన్ ప్రజల ఇగోని సంతృప్తి పరిచేందుకు ఇదిగో ఇలాంటి తొక్కలో నిర్ణయాలు తీసుకుంటుంది అప్పుడప్పుడు.