గత కొన్ని నెలల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. సంచలన చట్టాల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు.. జమ్మూకశ్మీర్ విభజన.. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం.. లాంటి నిర్ణయాలతో ఉగ్రవాదులకు పెద్ద శత్రువుగా మారిపోయాడు మోడీ. వాళ్లు మోడీని లక్ష్యంగా చేసుకుని పెద్ద స్కెచ్ లే వేస్తున్నట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి.
మోడీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. ఉగ్రవాదులు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు సమాచాం.. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ రాంలీలా మైదాన్ లో భారీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ ర్యాలీ సమయంలో మోడీని టార్గెట్ చేయాలని పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు నిర్ణయించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
ప్రధాని భద్రతను చూసుకునే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపుతో పాటు ఢిల్లీ పోలీసులను హెచ్చరిస్తూ ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక అందించాయి. ఇప్పటికే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు భారత్ కు చేరుకున్నారని నిఘావర్గాలు చెప్పాయి. డిసెంబర్ 22వ తేదీన జరిగే ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున్న పార్టీ కార్యకర్తలు - ప్రజలు - మీడియా ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ఇక్కడే ప్రధాని మోడీని టార్గెట్ చేశారని కూడా నిఘావర్గాలు హెచ్చరించాయి.