భారత్ పైకి హనీట్రాప్.. సంవత్సరానికి 3500 కోట్ల బడ్జెట్ పెట్టిన పాకిస్తాన్!
హనీ-ట్రాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి పాకిస్తాన్ మాజీ సైనికుల సంఘం మాజీ సైనిక ప్రతినిధి , రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఆదిల్ రాజా దీన్ని బయటపెట్టాడు. ప్రముఖ సినీ నటులను, ఇతర రాజకీయ నాయకులను హనీ-ట్రాప్ చేయడానికి పాకిస్తాన్ సైన్యం 'హనీ ట్రాప్'ను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
పాకిస్థాన్‌ను తాకిన తాజా వివాదం పెనుసంచలనంగా మారింది. ఈ ఆరోపణలను ముగ్గురు అగ్ర నటులు, సజల్ అలీ, కోబ్రా ఖాన్ మరియు మెహ్విష్ హయత్ ఖండించారు. 2017లో వచ్చిన 'మామ్' సినిమాలో శ్రీదేవితో కలిసి నటించిన అలీ దేశం నైతికంగా దిగజారడం, నీచంగా మారడం బాధాకరమని అన్నారు.
నటీనటులు ఆరోపణలను నిరాధారమైనవని కొట్టిపారేసినప్పటికీ.. పాకిస్తాన్ ఇలా భారత సైనికులపై, ప్రముఖులపై పాకిస్తాన్ లోని ప్రముఖులపై చాలా హనీ ట్రాపింగ్‌లో పాల్గొంటుందనేది వాస్తవం. ఇది అనేక సందర్భాల్లో భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించింది. హనీ ట్రాప్ చేయడానికి పాకిస్థాన్ ఆర్మీకి ప్రత్యేక విభాగం ఉంది. కొంతమంది జవాన్లు , సున్నితమైన సంస్థలలో పని చేసేవారు.
2019 సంవత్సరంలో మిలిటరీ నర్సింగ్ కార్ప్స్‌లో ఆర్మీ కెప్టెన్‌గా నటించిన అనికా చోప్రా అనే మహిళ తన రాడార్ కింద దాదాపు 50 మంది భారతీయ జవాన్లను హానీ ట్రాప్ చేసిందని తేలింది. ఆ మహిళ పాకిస్థానీ అని తర్వాత తెలిసింది. హనీ ట్రాపింగ్ అనేది చాలా గూఢచారి ఏజెన్సీల పాత ట్రిక్ అయితే, భారతదేశానికి ఆందోళన కలిగించేది ఏంటంటే ఈ హనీ ట్రాప్ భారత సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు పాకిస్తాన్ ఆడుతున్న గేమ్ కావడం గమనార్హం.
2019 వరకు పాకిస్తాన్‌లో ఇలా హనీ ట్రాపింగ్ చేయడానికి సంవత్సరానికి బడ్జెట్‌ను రూ. 3,500 కోట్లు కేటాయించారంటే వారు ఎంతలా భారత్ ను దెబ్బతీయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారన్నది అర్తం చేసుకోవచ్చు. ఐఎస్‌ఐ మరియు పాకిస్తాన్‌లచే నియంత్రించబడే హనీ ట్రాప్ మాడ్యూల్ ఫరీద్‌కోట్ నుంచి నడుస్తోంది. సంవత్సరానికి రూ. 3,500 కోట్ల బడ్జెట్ ను పాకిస్తాన్ కేటాయించి మరీ భారత్ సైన్యంపై ప్రయోగిస్తోంది. 2015 నుంచి ఈ హానీ ట్రాప్ కోసం బడ్జెట్ కేటాయింపులు చేస్తోందని తేలింది. ఇందులో ఐఎస్ఐ కీలక పాత్ర పోషిస్తోంది.
గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో ఐఎస్ఐ అటువంటి హానీ ట్రాప్ లను కూడా చిన్న స్థాయిలో ఏర్పాటు చేయగలిగిందని.. ఇవి పాకిస్తాన్‌లోని ఫరీద్‌కోట్‌లోని తమ ఉన్నతాధికారులకు ఉచ్చు ఎలా వేశారో నివేదిస్తాయని ఒక అధికారి బయటపెట్టారు.ఈ ఉచ్చు తర్వాత పాకిస్తాన్ నుండి వచ్చిన మహిళ నగదు ఎర ద్వారా లేదా బ్లాక్ మెయిల్ ద్వారా సమాచారాన్ని రాబట్టింది. చిక్కుకున్న వ్యక్తికి అందుతున్న సమాచారాన్ని బట్టి రూ.5 నుంచి 10 లక్షల వరకు చెల్లిస్తారు.
2019 లో రోహ్‌తక్ పోలీసులు గౌరవ్ కుమార్‌ను అరెస్టు చేశారు, దీని తరువాత అతను ఆర్మీ శిక్షణా శిబిరాన్ని సందర్శించిన ప్రతిసారీ చిత్రాలను క్లిక్ చేయమని తనను వేధించారని తెలిపాడు. ఆ సమయంలో కుమార్ ఆర్మీలో చేరేందుకు శిక్షణ పొందుతున్నాడు. అతను శిక్షణా శిబిరాన్ని 18 సార్లు సందర్శించినట్లు కనుగొనబడింది. ఆ సమయంలో అతను చిత్రాలను క్లిక్ చేసి సమాచారాన్ని పాకిస్తాన్ కు చెందిన హానీట్రాప్ చేసిన మహిళతో పంచుకున్నాడు. ఇలా భారత్ ను దెబ్బతీయడానికి పాకిస్తాన్ వేల కోట్లు హనీట్రాప్ కోసం ఖర్చు చేస్తోందని తాజాగా ఆ దేశ రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఆదిల్ రాజా బయటపెట్టడం సంచలనమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.