భార‌త్‌ కు ద‌గ్గ‌ర‌గా అణ్వాయుధాల్ని గురి పెట్టిన పాక్‌

Update: 2017-10-11 07:26 GMT
దాయాది దుష్ట‌బుద్ధి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. నిత్యం భార‌త్ లో ఏదో ఒక క‌ల‌క‌లం రేపాల‌ని దుర్మార్గ‌పు ప్లాన్లు వేసే దాయాది పాకిస్థాన్ మ‌రో దారుణ‌మైన ప్లాన్ వేసిన విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. భార‌త్ ను దెబ్బ తీసేందుకు అనుక్ష‌ణం త‌పించిపోయే పాక్‌.. తాజాగా అణ్వాయుధాల్ని భార‌త్‌కు ఎక్కు పెట్టేలా నిర్ణ‌యం తీసుకుందున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అణ్వాయుధాల్ని త‌యారు చేసుకున్న పాక్‌.. ఇటీవ‌ల కాలంలో పాక్ భారీ ఎత్తున అణ్వాయుధాల్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. సుమారు 140 అణు ఆయుధాల‌ను త‌యారు చేశార‌ని.. వాటిని ర‌హస్య ప్రాంతంలో దాచి ఉంచ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా ఒక అంత‌ర్జాతీయ వెబ్ సైట్ అందించిన స‌మాచారం ప్ర‌కారం.. పాక్ లోని మియ‌న్ వాలీ ప‌ట్ట‌ణంలో భారీ సొరంగాన్ని ఏర్పాటు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. 10 మీట‌ర్ల ఎత్తు.. వెడ‌ల్పు ఉన్న మూడు సొరంగాల్ని నిర్మిస్తున్నార‌ని.. ఈ ప్ర‌దేశానికి ర‌హస్య మార్గం ద్వారా అణ్వాయుధాల్ని చేర్చ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం బ‌య‌ట‌కు వ‌స్తోంది.  మియ‌న్ వాలీ ప‌ట్ట‌ణాన్ని అణ్వ‌స్త్ర ఆయుధాల స్థావ‌రంగా ఎంపిక చేసుకోవ‌టం వెనుక వ్యూహం ఉంద‌ని చెబుతున్నారు. భార‌త్‌కు కేవ‌లం 350 కిలోమీట‌ర్లు మాత్ర‌మే లక్ష్య‌మ‌ని.. అణ్వ‌స్త్రాన్ని అక్క‌డ నుంచి ప్ర‌యోగిస్తే.. తేలిగ్గా లక్ష్యాన్ని చేరుకోగ‌లుగుతుంద‌ని చెబుతున్నారు. మియ‌న్ వాలీకి అమృత్ స‌ర్ కేవ‌లం 350 కిలోమీట‌ర్లు అయితే.. దేశ రాజ‌ధాని ఢిల్లీకి కేవ‌లం 750 కిలోమీట‌ర్లు మాత్ర‌మే. కీల‌క‌మైన న‌గ‌రాల్ని టార్గెట్ చేసేందుకు వీలుగా ర‌హ‌స్య స్థావ‌రాల్ని ఎంపిక చేసుకున్నట్లుగా చెబుతున్నారు. పాక్ ముంద‌స్తు ఏర్పాట్ల నేప‌థ్యంలో భార‌త్ మ‌రింత అలెర్ట్ కావాల్సిన అవ‌స‌రం ఉంది.

Tags:    

Similar News