కీలక స్థానాల్లోకి వెళ్లగానే సరిపోదు. అందుకు తగ్గట్లుగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. చాలామంది అలాంటివి చేయకుండా తప్పులు చేస్తుంటారు. తాజాగా అలాంటి తప్పే చేసి.. అందరి ఆగ్రహానికి గురవుతున్నాడు పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్ మెన్ కమ్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్.
అతగాడు చేసిన ఒక పనికి ఆయన్ను అభిమానించే వారంతా తెగ టెన్షన్ పడిపోతున్నారు. మరో నాలుగైదు నెలల్లోబారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆయా దేశాల జట్టు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. కీలక టోర్నీకి ముందు జట్టుకు చెందిన కీలక సభ్యులు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. బాధ్యతగా ప్రాక్టీస్ చేస్తుంటారు.
ప్రాక్టీస్ లోనూ గాయాల బారిన పడకుండా కేర్ ఫుల్ గా ఉంటారు. అయితే.. అందుకు భిన్నంగా బాబర్ అజామ్ మాత్రం రాత్రి వేళ.. ఒక స్పోర్ట్స్ బైక్ మీద వేగంగా దూసుకెళుతున్న వైనం షాకింగ్ గా మారింది.
స్పోర్ట్స్ బైక్ మీద వేగంగా వెళుతున్న అతగాడు కేవలం హెల్మెట్ మాత్రమే ధరించాడు. దీనికి సంబంధించిన చిట్టి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన అతగాడి అభిమానులు ఆగమాగమైపోతున్నారు.
కొందరేమో.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ప్లీజ్.. అలా ఎలా చేస్తావ్ అంటూ వేడుకునే పరిస్థితి. నువ్వు చాలా ముఖ్యమైన ఆటగాడివి.. దయచేసి ఇలా బైక్ నడపొద్దని పేర్కొన్నారు.
మరో అభిమాని.. కెప్టెన్ రిస్క్ చేయకు.. ప్లీజ్ ప్రపంచ కప్ వరకు నువ్వు బైక్ నడపొద్దని ఒక అభిమాని పేర్కొంటే.. ఇంకో నెటిజన్ కాస్తంత ఘాటుగా రియాక్టు అవుతూ.. బాబర్ అజామ్ ఇలాంటి డేంజర్ చేష్టలు అవసరమా? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అతడ్ని కెప్టెన్సీ నుంచి తొలగించండని పేర్కొన్నారు.
వరల్డ్ కప్ కోసం నీ స్పీడ్ తగ్గించాలని మరో ఫ్యాన్ ట్వీట్ చేశారు. మొత్తానికి అతడి చర్యను అందరూ తప్ప పడుతున్నారు. ఇప్పటికైనా తన సాహసాల్ని పక్కన పెట్టేసి.. బుద్దిగా.. బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.