భార‌త్‌ ను భ‌య‌పెట్టేందుకు ఉమ్మ‌డి ఎత్తుగ‌డ‌

Update: 2016-04-11 07:41 GMT
భార‌త‌దేశం అంటే నిరంతం కాలు దువ్వే చైనా-పాకిస్థాన్ దేశాలు మ‌రో ఎత్తుగ‌డ‌కు తెర‌తీశాయి. ఈ రెండు దేశాలు క‌లిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. షహీన్ (ఈగిల్)-5 పేరిట నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను ఏప్రిల్ 9 నుంచి 30 వరకు ఈ రెండు దేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సంయుక్త సైనిక విన్యాసాలు ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు పెంపొందించుకు నేందుకు దోహద పడతాయని చైనాకు చెందిన సైనికాధికారి షీన్ అభిప్రాయ పడ్డారు. భవిష్యత్‌లో 'ఒకే లక్ష్యం'తో ముందుకు వెళ్లే వారితో కలిసి పనిచేసేందుకు, సహకరించేందుకు చైనా వాయుసేన సిద్ధంగా ఉందని షీన్ తెలిపారు.

గతంలో పాకిస్ధాన్...అమెరికా - చైనా - ఫ్రాన్స్ దేశాలు విక్రయించే యుద్ధ విమానాలపై ఆధారపడి ఉండేది. చైనా సహకారంతో సొంతగా జేఎఫ్-17 అనే యుద్ధ విమానాన్ని తయారు చేసుకుంది. భారత్ పొరుగు దేశాలైన ఈ రెండు దేశాలు భారత్ ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా నిర్వహిస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలు కూడా భారత్ ను దృష్టిలో పెట్టుకుని ఆ రెండు దేశాలు చేస్తున్నాయా? అనే అనుమానం కలుగుతోంది.
Tags:    

Similar News