పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ.. భారత్ లో హై అలెర్ట్

Update: 2020-02-02 11:07 GMT
మిడతల దండు పాకిస్తాన్ పై దాడి చేసింది.  మూడు రాష్ట్రాల్లోని పంటలను అతలాకుతలం చేస్తోంది. రైతులు ఆగమాగ మవుతున్నారు. దీంతో ఈ మిడతల దండును ఎదుర్కొవడానికి ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అల్లర్లు - గొడవలు - యుద్ధం - విధ్వంసాలకు సాధారణంగా ఎమర్జెన్సీ విధిస్తారు కానీ.. పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా మిడతల భయానికి ఎమర్జెన్సీ విధించడం సంచలనంగా మారింది.

పాకిస్తాన్ ధాన్యాగారంగా పంజాబ్, సింధ్ రాష్ట్రాలను పేర్కొంటారు. అక్కడ భారీగా పంట పండుతుంది.  ఇప్పుడు మిడతల దండు  ఈ రాష్ట్రాల్లోని 25లక్షలకుపైగా ఎకరాల విస్తీర్ణంలోని పంటలు, చెట్లను మిడతలు నాశనం చేశాయి. దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పాకిస్తాన్ ఆర్తిక వ్యవస్థనే నాశనం చేసేలా కనిపిస్తోంది.

మిడతల దాడితో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. సమీక్షించి నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. మిడతల్ని తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పాకిస్తాన్ ఎడారి ప్రాంతంలో జీవించే ఈ మిడతల దండు 1993లో కూడా ఇలాగే లక్షల సంఖ్యలో వచ్చి పంటలను నాశనం చేశాయి. ఇప్పుడు మరోసారి వచ్చాయి.

పాకిస్తాన్ లో మిడతల దండు దాడి నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తాజాగా ప్రధానికి లేఖ రాశారు. ఇండియాలోని పంటలను కూడా ఇవి దెబ్బతీస్తాయని.. వీటిని నియంత్రించాలని కోరారు.


Tags:    

Similar News