అభినందన్ ను విడిచిపెట్టిన తెల్లవారే పాకిస్తాన్ మరోసారి వక్రబుద్దిని ప్రదర్శించింది. పుల్వామా దాడికి సూత్రధారిని తానే అంటున్న స్వయనా పాక్ ఉగ్రవాది జైష్ ఏ మొహహ్మద్ అధినేత మసూద్ అజార్ ప్రకటించిన సంగతి తెల్సిందే. అయినా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి పథా మహమూద్ ఖురేషీ తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పుల్వామా దాడి ఘటనకు జైష్ ఏ మొహమ్మద్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వెనుకేసుకు రావడం దుమారం రేగుతోంది..
పుల్వామా దాడితో జైష్ ఏ మొహమ్మద్ సంస్థకు సంబంధాలున్నాయని పదేపదే చెబుతున్న భారత్ మాటలను నమ్మవద్దని ఖురేషి అన్నారు. పుల్వామా దాడికి సంబంధించి పాక్ ఉగ్రవాదుల హస్తం ఉందని నిరూపించే సాక్ష్యాలేమీకి భారత్ తమకు ఇవ్వలేదని తెలిపారు. భారత్ వద్ద ఏవైనా సాక్ష్యాలు ఉంటే తాము చర్యలు తీసుకునేందుకు రెడీగా ఉన్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. పాక్ కి చిక్కిన పైలట్ వర్ధమాన్ విడుదల సందర్భంగా పాక్ స్పందన కోసం భారత్ ఎదురు చూస్తుండగా ఖురేషి ఇలాంటి వ్యాఖలు చేయడం గమనార్హం.
కాగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ హాజరు కాలేదు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరైనందు వల్లే ఆయన హాజరు కాలేదని ప్రకటించారు.
పాకిస్తాన్ ఓ వైపు శాంతిమంత్రం జపిస్తూ.. మరోవైపు ఉగ్ర సంస్థను వెనుకొసుకువడాన్ని యావత్ ప్రపంచమంతా చూస్తుందన్న విషయాన్ని ఖురేషి మరిచిపోతున్నాయి. ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదుల పట్ల స్పష్టమైన వైఖరి తీసుకొని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత్ వంటి దేశాలతో కలిసి రావాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. అయినా పాకిస్తాన్ తీరులో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదని ఖురేషి మాటలను బట్టి అర్థమవుతోంది.