జమ్మూ-కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో కడుపుమంటతో ఉన్న పాకిస్తాన్ ఇండియాపై అన్నీ రకాలుగా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. ఆర్టికల్ 370కి రద్దుకి ప్రతీకార చర్యగా భారత్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్, భారత రాయబారి అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ తాజాగా మరో ప్రతీకార చర్యకి పూనుకుంది. ఇరుదేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీన్ని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు.
రెండు దేశాల మధ్య ఢిల్లీ - లాహోర్ పట్టణాలను కలుపుతూ ఈ రైలు నడుస్తోంది. ఇది ఓ చారిత్రక నిర్ణయంగా ప్రారంభమై కంటిన్యూ అవుతూ వస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే హఠాత్తుగా సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు నిలిపివేయడంతో వాఘా సరిహద్దులోని రైల్వేస్టేషన్‌లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకు పోయారు. వాఘా-అటారీ బోర్డర్ వద్ద ఈ రైలును తిరిగి భారతకు పంపించాల్సిన బాధ్యత పాక్‌దేనని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ తెలిపారు.
అయితే వీసా ఉన్న డ్రైవర్, ఇతర సిబ్బందిని పంపి రైలును తిరిగి ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా పాక్ తెలిపినట్టు చెప్పారు. కాగా, ఇరుదేశాల ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలు ప్రతి బుధ, ఆదివారాల్లో ఢిల్లీ, అటారీ , పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. ఈ రైలుతో పాటు గతంలో ఈ రెండు దేశాల మధ్య మున్నాబావో ఎక్స్‌ప్రెస్ కూడా నడిచేది. రాజస్థాన్‌లోని కాక్రపారా మీదుగా నడిచే ఈ రైలును అప్పట్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నిలిపివేశారు. పాక్ తాజా నిర్ణయంతో సంఝౌతాకు కూడా బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే ఈ నిర్ణయంతో పాటు పాక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత సినిమాలను తమ దేశంలో ప్రదర్శించకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రదర్శిస్తున్న బాలీవుడ్ సినిమాలను వెంటనే నిలిపివేయాలనీ కోరింది. అలాగే కొత్త సినిమాలను కూడా తాము అనుమతించబోమని పాక్ ప్రధాని ప్రత్యేక సహాయకుడు ఫిరదౌస్ అషిక్ అవాన్ చెప్పారు.