ఆ మోడ‌ల్ క‌రెన్సీ స్మ‌గ్లింగ్ తో దొరికింది

Update: 2017-07-04 08:15 GMT
పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్న‌ప్ప‌టికీ.. ఉన్న దాంతో స‌రిపుచ్చుకోలేని ప్ర‌ముఖులెంద‌రో. అడ్డ‌దారులు తొక్కేసి అడ్డంగా బుక్ అవుతుంటారు. పేరు ప్ర‌ఖ్యాతులు పోవ‌ట‌మే కాదు.. లేనిపోని కేసుల్లో ఇరుక్కొని జైలుపాలు కావ‌టం చాలామంది ఉదంతంలో చూసిందే. తాజాగా ఇలానే బుక్ అయ్యిందో మోడ‌ల్‌. అదిరిపోయే అందం.. అంత‌కు మించిన పేరు ఉన్న‌ప్ప‌టికీ.. సంతృప్తి చెంద‌ని ఈ కిలేడీ.. క‌రెన్సీ స్మ‌గ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

పాకిస్థాన్ లో సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. పాక్ మోడ‌ల్ అయ్య‌న్ అలీకి మోడ‌ల్ గా మంచి పేరు ఉంది. వ‌స్తున్న సంపాద‌న‌ను సంతృప్తి చెంద‌ని ఈ భామ‌.. మ‌రింత సంపాద‌న‌కు క‌క్కుర్తి ప‌డి అడ్డంగా బుక్ అయ్యింది. ఇస్లామాబాద్ న‌గ‌రంలో బేజ‌నీర్ భుట్టో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో త‌నిఖీల్లో  ఈ మోడ‌ల్ క‌రెన్సీ స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్లుగా గుర్తించారు.

అలీ బ్యాగులో 5,06,00 డాల‌ర్ల‌ను గుర్తించారు. దీంతో.. పాక్ క‌స్ట‌మ్స్ అధికారులు ఆమె ద‌గ్గ‌ర నుంచి ఆ భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని స‌ద‌రు మోడ‌ల్ ను క‌స్ట‌మ్స్ కోర్టులో ప్ర‌వేశ పెట్టారు. కేసును ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి ఆమెను అరెస్ట్ చేయాలంటూ వారెంట్ ఇష్యూ చేశారు.

అయ్య‌న్ అలీ ట్రాక్ రికార్డు చూస్తే.. ఈ ముద్దుగుమ్మ నిజంగానే కిలేడీగా చెబుతుంటారు. గ‌తంలోనూ దుబాయ్ విమానంలో 5ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను స్మ‌గ్లింగ్ చేస్తూ పోలీసుల‌కు దొరికిపోయింది. అప్పుడు రావ‌ల్ పిండి అధిలా జైలులో నాలుగు నెల‌లు జైలుశిక్ష అనుభ‌వించినా.. అమ్మ‌డిలో మార్పు రాలేదు. తాజాగా దొరికిపోయిన ఎపిసోడ్ లో మ‌రెన్ని నెల‌ల జైలుశిక్ష ప‌డుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News