తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ కు షాక్ తగిలింది. ఆ జాబితాలో భారత్ కన్నా దాయాది దేశం పాకిస్థాన్ మెరుగైన ర్యాంకు కలిగి ఉందని ఐరాస తెలిపింది. 156 దేశాల జాబితాలో భారత్ 133వ ర్యాంకులో నిలవగా - పాకిస్థాన్ 75వ ర్యాంకుతో భారత్ కన్నా మెరుగైన స్థితిలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే 2018లో భారత్ 11 స్థానాల కిందికి పడిపోయింది. అదే సమయంలో - దాయాది దేశం పాక్..గత ఏడాది కంటే మరో 5 ర్యాంకులు పైకి ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో శీతల దేశం ఫిన్ ల్యాండ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐరాసకు చెందిన ఎస్ డీఎస్ ఎన్ (సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్) ఈ నివేదికను ఏడాదికోసారి విడుదల చేస్తుంది. జీవన ప్రమాణాలు - సామాజిక మద్దతు - అవినీతి - సంతోషం స్థాయిలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందిస్తుంది.
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్ లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. రెండు - మూడు స్థానాల్లో నార్వే - డెన్మార్క్ నిలిచాయి. చిన్న చిన్న దేశాలైన బంగ్లాదేశ్ - భూటాన్ - నేపాల్ - శ్రీలంక లతో పాటు పొరుగు దేశం చైనా కూడా భారత్ కంటే ముందుండడం శోచనీయం. నిత్యం అశాంతి - ఉగ్రవాదం - అల్లర్లు - బాంబు పేలుళ్లతో దద్దరిల్లే పాక్....గత ఏడాది కన్నా నాలుగు స్థానాలు ఎగబాకడం ఆశ్చర్యకరం. పాక్ తో పోలిస్తే పెద్దగా ఉగ్రవాద సమస్యలు లేకుండా - అభివృద్ధి చెందుతోన్న దేశంగా పేరుగడించిన భారత్ 11 స్థానాలు దిగజారడం దిగ్భ్రాంతికరం. ఆ జాబితాలో ఫిన్లాండ్ - నార్వే - డెన్మార్క్ - ఐస్ లాండ్ - స్విట్జర్లాండ్ - నెదర్లాండ్ - కెనడా - న్యూజిలాండ్ - స్వీడన్ - ఆస్ట్రేలియా లు టాప్ -10 గా నిలిచాయి. అదేవిధంగా ప్రపంచంలోకెల్లా అత్యంత అసంతృప్తికరమైన దేశాల జాబితాలో మలావి - హైతీ - లిబేరియా - సిరియా - రువాండా - యెమెన్ - టాంజానియా - దక్షిణ సుడాన్ - సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - బురుండి లు టాప్ -10 లో ఉన్నాయి.