పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాక్ ప్రధానిగా.. రాజకీయ నాయకుడిగా మాత్రమే నవాజ్ షరీఫ్ చాలామందికి సుపరిచితులు. కానీ.. ఆయన పెద్ద పారిశ్రామికవేత్త అన్న విషయంతో పాటు.. ఆయన ఎంత సంపన్నుడన్న విషయం తెలిస్తే షాక్ తినాల్సిందే. ఆయన నివాసం రాజప్రసాదాన్ని తలపించేలా ఉండటమే కాదు.. వేల కోట్ల సంపన్నుడు షరీఫ్ అన్నది కొందరికి మాత్రమే తెలుసు.
షరీఫ్ ఆస్తులకు సంబంధించి పనామా పేపర్స్ లీక్ లో భారీగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన పాక్ సుప్రీం కోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. పనామా పేపర్స్ లీక్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంది. ఈ నెల 15న ఉదయం పదకొండు గంటల వేళలో ఇస్లామాబాద్ లోని ఫెడరల్ జ్యూడీషియల్ అకాడమీలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.
పాక్ దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ప్రధాని న్యాయవిచారణ ఎదుర్కొనలేదు. సుప్రీం కోర్టు విచారణకు హాజరైన మొదటి ప్రధాని నవాజ్ షరీఫ్ అవుతారని అక్కడి మీడియా చెబుతోంది. ఇదే ఉదంతంలో నవాజ్ రెండో కొడుకు విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అంతకు ముందు షరీఫ్ పెద్ద కొడుకు కూడా విచారణ కమిటీ ఎదుట మూడోసారి హాజరయ్యారు. కొడుకుల విచారణ తర్వాత తండ్రిని విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/