పాకిస్థాన్ ప్రధానమంత్రితో భారత్ ప్రధాన మంత్రికి ఉన్నది వ్యక్తిగత స్నేహం అనేది బీజేపీ నేతల మాట. ఈ స్నేహ ధర్మాన్ని పాకిస్థాన్ పాటించలేదని - అందుకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని చెబుతున్నారు. పాముకు పాలుపోస్తే అది తిరిగి కాటేసిందని - పాముకు స్నేహ హస్తం అందిస్తే.. ఆ చేతినే అది కాటేసిందని చెబుతున్నారు. పాముకు స్నేహహస్తం అందిస్తే ఎంతో.. పాక్ తో స్నేహం చేసిన ఆంతే అనే విషయం భారత ప్రధానికి తెలియదా? కాసేపు ఆ విషయాలు పక్కనపెడితే... భారత్ పై ఉగ్రవాదుల దాడి జరిగింది. భారత్ పై ఉగ్రవాదులు / పాక్ ఉగ్రవాదులు దాడి చేశారంటే.. వారేదో పరాయి మనుషులుగా పాక్ చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశం. భారత్ పై దాడిచేస్తున్న ఉగ్రవాదులంటే.. పాక్ అప్రకటిత - అనధికారిక సైనికులే అన్నది భారత్ తో పాటు ప్రపంచానికి తెలిసిన విషయమే.
తాజాగా జమ్ము-కశ్మీర్ లోని ఉరీ వద్ద జరిగిన తీవ్రవాద దాడి దుర్ఘటన వెనక పాక్ హస్తం ఉందనేది పాక్ తో పాటు అందరికీ తెలిసిన విషయమే! అయితే ఈ విషయంలో తమ హస్తం ఉందని భారత్ ఆరోపించడాన్ని ఖండిస్తున్నామని చెబుతుంది పాక్. భారత్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవనీ - తొందర పాటు విమర్శలనీ పాక్ చెప్పుకొస్తుంది. ఇదే సమయంలో తమపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు కూడా చూపాలని డిమాండ్ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి రెండువైపులా కట్టుదిట్టమైన భద్రత ఉందనీ.. చొరబాట్లనేవి అసలు జరగనేలేదనీ పాక్ సైనిక ప్రతినిధి ఒకరు స్పష్టం చేస్తున్నారు.
ఇక్కడే ఉంది అసలు సమస్య... నియంత్రణ రేఖకు రెండువైపులా కట్టుదిట్టమైన భద్రత ఉంటే.. పాక్ కు తెలియకుండా భారత్ భూభాగంలోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశిస్తారు. భారత్ సైనికుల అనుమతితోనే - అలసత్వంతోనే ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారని చెప్పడం పాక్ ఉద్దేశ్యమా? లేక భారత సైనికులే కావాలని ఉగ్రవాదులతో దాడి చేయించుకుని, మరణించారని చెప్పడం వారి మాటల అంతరార్ధమా? అడ్డంగా వాదించడానికి కూడా కాస్త పద్దతి ఉందనే విషయం ఎప్పుడొ మరిచిపోయిన పాక్.. మరలా అదేపాట్ పాడుతుంది. ఈ విషయంపై ఇప్పటికైనా భారత్ కాస్త గట్టిగా కాదు, గట్టిగానే వ్యవహరించాలని, ప్రతిస్పందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.