అభినందన్ వీడియో వెనుక కథ ఇదీ..పాక్ పన్నాగం

Update: 2019-03-02 04:21 GMT
పాకిస్తాన్ కు చిక్కిన పాకిస్తాన్ వింగ్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత భారత్‌ భూభాగంలో అడుగుపెట్టాడు. అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తామని పాక్‌ ప్రకటించినప్పటి నుంచి భారత్‌ దేశవ్యాప్తంగా ఉద్వేగ వాతావరణం నెలకొంది. ఆయన రాక కోసం కోట్ల మంది ఎదురుచూశారు. ఎప్పటికప్పుడు లైవ్‌ టెలీకాస్ట్‌ చేస్తున్న మీడియాను చూస్తూ జనం రోజంతా గడిపారు.

అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఆయనను విడుదల చేస్తామని చెప్పిన పాక్‌ ఆలస్యం చేసింది. రాత్రివరకు కూడా ఆయనను వాఘా సరిహద్దుకు తీసుకురాలేదు. దీంతో అభినందన్‌ను ఆలస్యంగా తీసుకురావడానికి గల కారణాలేంటేనిది ఈరోజు పాక్ మీడియా వెల్లడించింది. .

అభినందన్‌ను విడుదల చేసే ముందు పాక్‌ ఆర్మీ ఆయనపై ఓ వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోను పాక్‌ మీడియాకు అందించారు. తాము క్షేమంగా విడుదల చేస్తున్నట్లు తెలిపేందుకే పాకిస్తాన్ ఈ వీడియోను చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ వీడియో కోసం స్క్రిప్ట్ ప్రిపరేషన్.. అభినందన్ తో మాట్లాడించేందుకు పాకిస్తాన్ ఆర్మీ సమాలోచనలు చేసింది. అభినందన్ పై ఇలా చెప్పాలని ఒత్తిడి తీసుకొచ్చింది.  అనంతరం వీడియో తీసి విడుదల చేసింది.

ఈ వీడియోలో అభినందన్‌ మాట్లాడుతూ ' నా పేరు అభినందన్‌. నేను ఎయిర్‌ ఫైలట్‌ వింగ్‌ కమాండర్ ని.. లక్ష్యసాధనలో భాగంగా పాక్‌ భూభాగంలోకి విమానంతో వెళ్లగా పాక్‌ నా విమానాన్ని కూల్చి వేసింది. నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో ప్యారాచూట్‌తో నేను పాక్‌లో దిగాను. కొందరు నన్ను పట్టుకొన్ని దాడి చేయగా పాక్‌ ఆర్మీ నన్ను కాపాడింది. వారు నాకు ఏం కాకుండా చూసుకున్నారు. పాకిస్తానీ ఆర్మీ చాలా హుందాగా వ్యవహరించింది.ఆ తరువాత నాకు ప్రథమ చికిత్స చేయించారు. పాక్ ఆర్మీలో నేను శాంతిని చూశాను. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం. నన్ను పాక్‌ ఆర్మీ చాలా బాగా చూసుకున్నారు' అంటూ పాకిస్తాన్ ఆర్మీ తమనుతాము మంచివాళ్లమని అభినందన్ స్వయంగా వీడియోలో చెప్పించారు.

ఈ విధంగా అభినందన్‌ విడుదలకు ముందు డాక్యుమెంటేషన్‌ తో పాటు ఆయన వీడియో తీయడం వల్లనే ఆలస్యమైందని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.  అయితే అభినందన్ మాట్లాడిన మొత్తం రిలీజ్ చేయకుండా పాకిస్థాన్‌ ఆర్మీ  వారికి అనుకూలంగా కత్తిరింపులు పెట్టి వీడియో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది.

   



Full View



Tags:    

Similar News