భారతదేశంపై పాక్ మరోమారు కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్-పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తట్టపాని సెక్టార్‌లో ఐదుగురు భారత సైనికులను తాము చంపేశామంటూ ప్రకటించి తన దురహంకారాన్ని చాటుకున్న పాక్...ఆ మరుసటి రోజే ఇంకో రెచ్చగొట్టే చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత మిలిటరీ స్థావరాలను తాము ధ్వంసం చేశామని పేర్కొంటూ వీడియో విడుదల చేసింది.
పాక్ ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ ఘఫూర్ తన ట్విట్టర్ అకౌంట్లో 27 సెకన్లపాటు నిడివి గల వీడియో ఒకటి పోస్ట్ చేశారు. తాము ఇండియన్ ఆర్మీ స్థావరాలపై దాడి చేశామనేందుకు ఇదే నిదర్శనమని తెలిపారు. ఈ వీడియోలో కూడా భారత సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఈ వీడియోపై భారత ఆర్మీ అధికారికంగా స్పందించలేదు. కొద్దికాలం క్రితం పాకిస్తాన్ ఇలాంటిదే వీడియో ఒకటి విడుదల చేయగా అది నకిలీ అంటూ మనదేశం తేల్చేసిన నేపథ్యంలో తాజా వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, భారత బంకర్లపై తాము దాడి చేసి ఐదుగురు సైనికులను చంపేసినట్లు పాక్ అంతర్గత సేవల విభాగం ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భారత ఆర్మీ స్పందించలేదు. అయినప్పటికీ పాక్ ఆర్మీ అధికారిక ప్రతినిధి వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/