సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నది మన సామెత. కానీ.. పొరుగున ఉన్న పాకిస్థాన్ లో ఒక అమ్మాయి పెళ్లి ఏకంగా 17 మంది ప్రాణాల్ని తీయటం సంచలనంగా మారింది. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో ప్లాన్ చేసుకొని కట్టుకున్న భర్తను చంపేయాలని ప్లాన్ చేసింది.
అయితే.. ప్లాన్ రివర్స్ కావటంతో ఏకంగా 17 మంది మరణించగా.. మిగిలిన వారు చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా తీవ్ర ఆనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ లో తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఈశాన్య పాక్ లోని అలీపూర్ కు చెందిన 21 ఏళ్ల ఆసియా బీబీకి పెళ్లిని ఫిక్స్ చేశారు ఆమె పేరెంట్స్.
అయితే.. ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. అదే విషయాన్ని పేరెంట్స్ కు చెప్పినా వినలేదు. తానెంత చెప్పినా వినకుండా పెళ్లి చేస్తున్న నేపథ్యంలో.. పెళ్లికొడుకును హతమార్చాలన్న దారుణమైన ప్లాన్ వేసింది. పెళ్లి పూర్తి అయిన తర్వాత పాలు ఇవ్వగా.. దాన్లో ప్రియుడు తీసుకొచ్చిన విషాన్ని కలిపి భర్తకు ఇచ్చింది.
ఏమైందో ఏమో కానీ.. పాలు తాగాల్సిన భర్త ఆ పని చేయలేదు. ఆ పాలను కాస్తా లస్సీకి ఉపయోగించారు. మొత్తం 27 మందికి విషం ఉన్న పాలతో తయారుచేసిన లస్సీ తాగారు. దాన్ని తాగిన వెంటనే వారంతా స్పృహ తప్పి పడిపోయారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మొత్తం17 మంది మరణించగా.. మిగిలిన వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇంతమంది మరణంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. అసలు గుట్టు రట్టు చేశారు. అనంతరం పెళ్లి కుమార్తెను.. ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న ఉద్దేశంతో భర్తను చంపాలని అనుకున్నానే కానీ.. మిగిలిన వారి ప్రాణాలు తీయాలని తాను అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ప్రస్తుతం ఆమెను.. ఆమె ప్రియుడ్నిఅరెస్ట్ చేశారు. అనంతరం కోర్టుకు హాజరు పర్చారు. దీనిపై విచారించిన కోర్టు కేసును వాయిదా వేసింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసిన నేపథ్యంలో భర్త మీద కోపంతోనే ఇలాంటి పని చేశానే తప్పించి.. మిగిలిన వారిని చంపాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని పేర్కొంది.