ప్రపంచకప్ తీసుకురాకున్నా ఫర్లేదు.. పాక్ మీద మాత్రం గెలవాల్సిందే. ఈ డిమాండ్ భారత్ లోనే కాదు.. దీనికి రివర్స్ గా పాక్ ప్రజలు కోరుకునే పరిస్థితి. దాయాది దేశాల మధ్య నెలకొన్న శత్రుత్వం నేపథ్యంలో పైచేయి కోసం పడే తపన అలా ఇలా ఉండదు. ఆదివారం ముగిసిన మ్యాచ్ లో భారత భీకర ప్రదర్శన ముందు పాక్ జట్టు తేలిపోవటమే కాదు.. దారుణ పరాజయానికి గురైంది.
ఈ ఓటమిని ఒక పట్టాన తట్టుకోలేకపోతున్నారు పాకిస్థానీయులు. ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకూ భారత్ మీద ఒక్కసారి కూడా గెలవని పాక్ మరోసారి ఓడిపోవటాన్ని పాక్ జాతీయులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. పాక్ క్రికెటర్ల మీద తిట్ల దండకం అందుకుంటున్న వారు.. ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తున్నారు. అంతేనా.. ఓటమిని తట్టుకోలేని పాకిస్థానీయులు టీవీలు పెద్ద ఎత్తున పగలగొడుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తమ జట్టు సభ్యులు పేలవమైన ఆట తీరును ప్రదర్శించినట్లుగా మండిపడుతున్నారు. పాక్ మీడియా సైతం పాక్ జట్టు ఆట తీరును తప్పు పడుతోంది. ఇదిలా ఉంటే.. టాస్ గెలిస్తే కచ్ఛితంగా బ్యాటింగ్ తీసుకోవాలని దేశ ప్రధాని ఇచ్చిన సలహాను పెడచెవిన పెట్టిన కెప్టెన్ సర్పరాజ్ తీరును పాకిస్థానీయులు మండిపడుతున్నారు. అనుభవంతో చెప్పిన మాటను లైట్ తీసుకోవటమా? అంటూ ఫైర్ అవుతున్నారు.