దేశాన్ని వీడేందుకే మొగ్గు చూపుతున్న పాకిస్థానీలు..!

Update: 2022-12-13 07:30 GMT
భారత్-పాక్ రెండు దేశాలకు కూడా స్వాతంత్ర్యం ఒకే సమయంలో వచ్చింది. బ్రిటీష్ పాలకులు కుట్ర కారణంగా పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించిన సంగతి అందరికీ తెలిసిందే. భారత్ కంటే ఒక రోజు ముందే పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం రాగా ఆ దేశం కూడా ఇటీవలే 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలను జరుపుకుంది.

ఇండియా.. పాకిస్థాన్ దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినప్పటీకీ  ఇరుదేశాల మధ్య ఎంతో వ్యత్యాసం నెలకొంది. పాక్ లో నేటికి  రాజకీయ.. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. మరోవైపు భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ ముందుకెళుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేరాఫ్ గా నిలుస్తుండటమే ఆ దేశంలోని అనిశ్చితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఒక్క ప్రధాని కూడా పూర్తి స్థాయి పదవీలో ఉండ లేదంటే అక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పాక్ ఆర్మీ తరుచూ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ ప్రభుత్వాన్ని కూల్చడం అక్కడ ఆనవాయితీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలన గాడి తప్పడంతో పాకిస్తాన్లో అభివృద్ధి కుంటుపడుతుంది.

దీనికితోడు పాకిస్థాన్ పాలకులు తమ ప్రజల గురించి ఆలోచించకుండా నిత్యం కశ్మీర్ జపం చేస్తూ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ తో పాక్ సంబంధాలు తరుచూ క్షీణిస్తున్నాయి. ఇది కూడా పాకిస్థానీయులకు భారత్ లో అవకాశాలు లేకుండా చేస్తోందనే వాదనలు విన్పిస్తున్నాయి.

పాక్ లో రాజకీయ అనిశ్చితి.. ఆర్థిక సంక్షోభం.. నిరుద్యోగం నానాటికి పెరిగి పోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. దీనికితోడు పాక్ లో ఉగ్రవాదం పెచ్చు మీరుతుండటంతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ ను వీడిందుకు అత్యధిక ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఓ సర్వేలో వెల్లడైంది.

బెలూచిస్థాన్.. ఖైబర్.. సింధ్ ప్రావిన్సులలో అత్యధికంగా ప్రజలు తమ దేశాన్ని వీడి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆప్ ఎకనామిక్స్ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో వెల్లడించారు. 15 ఏళ్లు పైబడిన 20 వేల 548 సర్వేలో పాల్గొనగా వీరిలో 37శాతం మంది వీలైతే దేశం విడిచిపోవడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. ఇటీవల కాశ్మీర్ విషయంలో భారత్-పాక్ మధ్య తరుచూ ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో పీవోకేలోని 44శాతం మంది ప్రజలు అక్కడ నుంచి తరలి పోవాలని భావిస్తున్నారని వెల్లడించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News