కొత్త రాష్ట్రం తెలంగాణలో ప్రతిపక్షాలకు ఇంకా గడ్డు పరిస్థితులు కొనసాగడం ఖాయమేనట. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం, అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన టీఆర్ఎస్‌కు ఆ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడం - టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాత రాష్ట్రం నుంచి సీమాంధ్రులను తరమికొట్టడమే లక్ష్యంగా కేసీఆర్ అవలంభించిన వ్యూహం కూడా బాగానే సక్సెస్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రాల రాజధానిగా హైదరాబాదు పదేళ్ల పాటు కొనసాగనున్నప్పటికీ.. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రోజుల వ్యవధిలో తట్టా బుట్టా సర్దేసుకుని విజయవాడ వెళ్లిపోవాల్సి వచ్చింది.
అదే సమయంలో తెలంగాణ నుంచి తెలుగు దేశం పార్టీని నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా పావులు కదిపిన కేసీఆర్... టీడీపీ ఎమ్మెల్యేల్లో 12 మందిని తన పార్టీలోకి లాగేశారు. 15 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న టీడీపీ... కేసీఆర్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు ముగ్గురు సభ్యులున్న పార్టీగా మారిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పైనా దృష్టి సారించిన కేసీఆర్.. ఆ పార్టీ నుంచి కూడా చాలా మందిని తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ప్రభావం బాగా తగ్గిపోగా... కాంగ్రెస్ పార్టీ కొంతలో కొంతైనా కేసీఆర్ సర్కారుకు ఎదురొడ్డి నిలుస్తోంది. ఇప్పుడు టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు ఒకరిద్దరు మంత్రులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని... నేడో - రేపో వారంతా కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమేనని ఇటీవల టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన అక్కడ పెను ప్రకంపనలే రేగాయి. ఈ క్రమంలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఏ మేర ప్రభావం చూపగలిగే వారో జనానికి తెలుసులే అంటూ టీఆర్ ఎస్ కూడా ఉత్తమ్ పై ఘాటుగానే విమర్శలు చేసింది.
ఈ క్రమంలో కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన టీఆర్ ఎస్ నేత - ఆ పార్టీ ఎమ్మెల్సీ - శాసనమండలిలో పార్టీ విప్ గా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి.. ఆసక్తికర కామెంట్లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న నేతలంతా తమతో టచ్ లో ఉన్నారని, వారంతా ఏ క్షణాన్నైనా టీఆర్ ఎస్ లో చేరడం ఖాయమేనని సంచలన ప్రకటన చేశారు. ఈ చేరికల తర్వాత టీ కాంగ్రెస్ లో మిగిలేది ఇద్దరు నేతలు మాత్రమేనని ఆయన తేల్చేశారు. ఆ ఇద్దరు ఎవరన్న విషయాన్ని కాస్తంత ఇండైరెక్ట్ గా చెప్పిన పల్లా... ఉత్తమ్ కుమార్ రెడ్డి - మల్లు భట్టి విక్రమార్కలేనని తేల్చి చెప్పారు. పల్లా మాటల్లో ఎంత మేర నిజముందో తెలియదు గానీ... అధికార పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రకటనతో టీ కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఇది హాట్ టాపిక్ గా మారింది.