ఫైర్ బ్రాండ్‌ కు మ‌ళ్లీ జైలు త‌ప్ప‌ద‌ట‌

Update: 2017-06-30 11:32 GMT
క‌దిలించి తిట్టించుకోవ‌టం కొంత‌మంది నేత‌ల‌కు స‌మ్మ‌గా ఉంటుందేమో? తాజాగా తెలంగాణ తెలుగుదేశం శాస‌న‌స‌భాప‌క్ష నేత రేవంత్ రెడ్డి తీరు ఇదే రీతిలో ఉంద‌ని చెప్పాలి. కేంద్రంలోని మోడీ స‌ర్కారు తీసుకొస్తున్న స‌రికొత్త ప‌న్ను వ్య‌వ‌స్థ జీఎస్టీకి మ‌ద్ద‌తు ప‌లికిన తెలంగాణ అధికార‌ప‌క్షాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంతో క‌లిసి పోయి ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించే జీఎస్టీకి ఓకే చేశారంటూ ఆరోపించారు. నిజానికి జీఎస్టీ విష‌యంలో కేసీఆర్ స‌ర్కారును త‌ప్పు ప‌ట్టేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం హ‌క్కు లేద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇదే టీడీపీ అధికారంలో ఉన్న ఏపీలో జీఎస్టీకి మ‌ద్ద‌తు ప‌లికిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

కానీ.. ఆ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ప‌క్క‌నే ఉన్న రాష్ట్రంలో త‌మ పార్టీ ఇదే జీఎస్టీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న వేళ‌.. తాను విమ‌ర్శించ‌టం మంచిది కాద‌న్న విష‌యాన్ని గుర్తిస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అప్పుడెప్పుడో కేసీఆర్ కేంద్ర‌మంత్రిగా ఉన్న వేళ‌లో అవినీతి ప‌నుల‌కుపాల్ప‌డ్డార‌ని వాటిని క‌ప్పి పుచ్చుకునేందుకే జీఎస్టీకి కేసీఆర్ ఓకే చెప్పిన‌ట్లుగా కాసింత సిత్ర‌మైన లాజిక్‌ ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

రేవంత్ ఆరోపించిన తీరులోనే ఏపీలోనూ విప‌క్ష నేత‌లు తమ అధినేతను సైతం త‌ప్పు ప‌డ‌తార‌న్న విష‌యాన్ని రేవంత్ గుర్తించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ముందే అనుకున్న‌ట్లు రేవంత్ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు తెలంగాణ‌లో ఒక విధంగానూ.. ఏపీలో మ‌రో విధంగానూ మాట్లాడుతున్నారంటూ టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి  మండిప‌డ్డారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను సీబీఐ విచారించిందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆధారాలు చూపించాల‌ని స‌వాలు విసిరారు. రేవంత్ తాను చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు చూపించాల‌ని మండిప‌డుతూనే.. రోడ్డు మీద ఎవ‌డో ఎదో మాట్లాడాడ‌ని ఆ వ్యాఖ్య‌ల మీద తాము రియాక్ట్ కావాలా? అంటూ క్వ‌శ్చ‌న్ వేశారు. రేవంత్ మ‌ళ్లీ జైలుకు వెళ్ల‌టం ఖాయ‌మ‌న్నారు. టీఆర్ ఎస్ అవున‌న్నా.. కాద‌న్నా జీఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని.. కేంద్రం జీఎస్టీని తీసుకురావాల‌న్న పట్టుద‌ల‌తో ఉంది కాబ‌ట్టే తాము మ‌ద్ద‌తు ఇచ్చామ‌న్నారు. జీఎస్టీ అంశంపై టీడీపీ నేత‌లు అర్థం లేకుండా మాట్లాడుతున్నార‌ని.. జాతీయ‌పార్టీ అని చెప్పుకునే వారికి రాష్ట్రాల వారీగా విధానాలు ఉంటాయా? అని ప్ర‌శ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News