మూడు రాజ‌ధానుల‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ద్ద‌తు!

Update: 2020-01-24 08:35 GMT
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లం రాజు మూడు రాజ‌ధానుల ఫార్ములాకు మ‌ద్ద‌తు ప‌లికారు. తిరుప‌తిలో ఆయ‌న మాట్లాడుతూ.. అమ‌రావ‌తి అతి పెద్ద త‌ప్పిదం అన్నారు. చంద్ర‌బాబు నాయుడు చేసిన రాజ‌కీయ త‌ప్పిదాల్లో అమ‌రావ‌తి బ్లండ‌ర్ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. విశాఖ‌ను ఒక రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డాన్ని ప‌ల్లంరాజు స్వాగ‌తించారు. పాల‌న‌కు విశాఖ అత్యంత అనువైన న‌గ‌రం అని ప‌ల్లంరాజు అభిప్రాయ‌ప‌డ్డారు.

వాతావ‌ర‌ణం రీత్యా విశాఖ రాజ‌ధానిగా అత్యంత సానుకూల న‌గ‌రం అని అన్నారు. శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ నివేదిక‌ను తుంగ‌లో తొక్కార‌ని చంద్ర‌బాబును విమ‌ర్శించారు ప‌ల్లంరాజు. మూడు రాజ‌ధానుల విష‌యంలో కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు పెద‌వి విరుపులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 ప్ర‌త్యేకించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పొడ ఏ మాత్రం గిట్ట‌ని తుల‌సిరెడ్డి వంటి వాళ్లు మూడు రాజ‌ధానుల ఫార్ములాను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. ఏనాడూ ప్ర‌జ‌ల నుంచి నెగ్గ‌ని తుల‌సి రెడ్డి లాంటి వాళ్లు జ‌గ‌న్ ఏం చేసినా త‌ప్పే  అన్న‌ట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడూ అలాగే స్పందిస్తూ ఉన్నారు.  కేంద్ర మాజీ మంత్రి అయిన ప‌ల్లం రాజు మాత్రం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించ‌డం గ‌మనార్హం.
Tags:    

Similar News