ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో రాజకీయం వేడివేడిగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వర్సెస్.. టీడీపీ నాయకుడు, సీనియర్ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య రాజకీయం సలసల కాగుతోంది. నువ్వా-నేనా అనే రేంజ్‌లో ఇద్దరూ కూడా రాజకీయాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరి వ్యూహాలు వారివే అన్నట్టుగా ముందుకు సాగుతున్నాయి.
అయితే..ఇక్కడ యరపతినేని దూకుడు ముందు.. ఎమ్మెల్యే కాసు వెనుకబడిపోయారనే వాదన వినిపిస్తోం ది. గుంటూరు-గురజాల-హైదరాబాద్ చుట్టూనే కాసు తిరుగుతున్నారు. అదేమంటే.. అభివృద్ధి పనులను నిధులు సమకూరుస్తున్నానని ఆయన చెబుతున్నారు.
అయితే.. అదేసమయంలో యరపతినేని మాత్రం.. నియోజకవర్గంలో ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయి. శ్రావణ మాసంలో ఆడపడుచులకు పసుపు -కుంకమ కింద సారె పంచి.. వారిని ఆకట్టుకున్నారు.
ఇక, కార్తీక మాసంలో యువతను వనభోజనాలకు తీసుకువెళ్తున్నారు. వారి అభిరుచుల మేరకు.. కార్యక్ర మాలు సైతం నిర్వహిస్తూ.. మన నాయకుడు అనే మాటను మరోసారివారు అనేలా చేస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. గ్రామీణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యరపతినేని.. పల్లెనిద్ర పేరుతో.. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారానికి మూడు రోజుల పాటు .. పల్లెలకు వెళ్లి.. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వారితోనే కలిసి భోజనాలు చేసి.. అక్కడే నిద్రిస్తున్నారు.
ఇలా.. చేయడం ద్వారా.. పునర్వైభవం తెచ్చుకు నే దిశగా మాజీ ఎమ్మెల్యే వేస్తున్న అడుగులు ఫలిస్తున్నాయని అంటున్నారుపరిశీలకులు. ఇక, రాజకీయంగా కూడా కాసుకు.. సవాళ్లు రువ్వుతున్నారు. అభివృద్ధిపై చర్చంచేందుకు తాను సిద్ధమని.. ప్రకటిం చారు. కనీసం తాను అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకు వెళ్లలేక పోతున్నారని బహిరంగ విమర్శలు చేయడం ద్వారా.. కాసును డిఫెన్స్‌లో కి నెడుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ పరిణామాలతో గురజాలలో టీడీపీకి చాలా ప్లస్ అవుతోందన్న చర్చ అయితే నడుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.