ఎన్నికలు ఉన్నట్టా..లేనట్టా.. ఏపీలో అంతా గందరగోళం..!

Update: 2021-01-25 05:45 GMT
ఆంధ్రప్రదేశ్​లో అసలు పంచాయతీ ఎన్నికలు ఉన్నట్టా లేన్నట్టా? ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ పక్కన ఎన్నికల కమిషన్​ షెడ్యూల్​ విడుదల చేసింది. నోటిఫికేషన్​ కూడా విడుదల చేసింది. ఈసీ లెక్క ప్రకారం ఈరోజు ఉదయం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అధికార యంత్రాంగం మాత్రం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదు. రిటర్నింగ్​ అధికారులను నియమించలేదు.

 కలెక్టర్లు ఎన్నికల కమిషనర్​తో మీటింగ్​కు హాజరుకావడం లేదు. ఈసీ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఈ వైపు ఎన్నికలు నిర్వహించడం రాష్ట్రప్రభుత్వానికి ఇష్టం లేదు. దీంతో సుప్రీంకు వెళ్లింది ప్రభుత్వం. అయితే ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ పిటిషన్​ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం.. ప్రభుత్వానికి మధ్య గ్యాప్​ రావడంతో ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఉద్యోగసంఘాలు ఇప్పటికే తాము ఎన్నికల విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు.

 ఈ దశలో ఎన్నికల సంఘం ఏం చేయబోతున్నదో అర్థం కావడం లేదు. రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలు నిర్వహిస్తున్నది.

దీంతో ఇటు సీఎస్​, డీజీపీ ఎవరూ ఈసీ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఏపీ సర్కారు మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇవాళ ఒకవేళ ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పువస్తే.. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. మధ్యాహ్నం తర్వాత ఏపీ సర్కార్​ పిటిషన్​ కోర్టుకు మందుకెళ్లే అవకాశం  ఉంది.
Tags:    

Similar News