పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రశస్తే లేదని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు పేర్కొన్నారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశామన్నారు. విశాఖ రేంజ్ పరిధిలో 582 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని ఆయన చెప్పారు. 144 అతి సమస్యాత్మక ప్రాంతాలు, 206 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడినా.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా చర్యలు తప్పవన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అందరూ నిబంధనల ప్రకారం ఎన్నికలకు సహకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొంత ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా స్థానికసంస్థలు, మున్సిపల్ ఎన్నికల టైంలో ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘానికి మధ్య సమన్వయం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
ఇటు ఎన్నికల సంఘం మాట వినాలో.. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలో తెలియక కొందరు అధికారులు సతమతమవుతున్నారు.ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఎన్నికల విషయంపై ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చంటూ ఈసీ ఓ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వం కోర్టుకెళ్లగా కోర్టు సదరు యాప్‌పై వినియోగించొద్దని స్టే విధించింది.