ఏపీని కరుణించిన కరోనా...కేసులు తగ్గుముఖం

Update: 2020-10-12 17:17 GMT
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం....మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం,ప్రజలు ఊరట చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోనూ గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గతంలో రోజుకు పదివేలకు తగ్గకుండా నమోదైన కేసులు క్రమక్రమంగా తగ్గుతూ 5-6 వేలకు చేరుకున్నాయి. తాజాగా ఆ సంఖ్య 3వేలకు పడిపోవడం ఊరటనిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 3200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన 3200 కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.58 లక్షలకు చేరుకుంది. మొత్తం 7.08 లక్షల మంది కరోనా బారినుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున చనిపోయారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 32మంది కరోనా బారిన పడి మరణించారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6256కు చేరింది.

ఏఫీలోని అన్ని జిల్లాల్లోనూ కరోనా ప్రభావం తగ్గినట్టు కనిపిస్తోంది. గుంటూరు, కడపలో నలుగురు చొప్పున, అనంతపూర్‌, తూర్పుగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పన, చిత్తూరు, పశ్చిమగోదావరిలో ఇద్దరేసి చొప్పున, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు.గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 547 , పశ్చిమగోదావరి జిల్లాలో 489, గుంటూరులో 379, చిత్తూరులో 293, ప్రకాశంలో 270 కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో 133, విశాఖలో 135, కర్నూల్లో 136, నెల్లూరులో 166, విజయనగరంలో 191, అనంతపురంలో 209 కేసులు వచ్చాయి. కృష్ణాజిల్లాలో అతి తక్కువగా 86 కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News