కరోనా : 24 గంటల్లో 93 మంది మృతి ..కొత్త కేసులు ఎన్నంటే ?

Update: 2020-08-12 16:00 GMT
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. బుధవారం కూడా కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత రెండు రోజుకు మించి కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా మరణాలు సైతం భారీగా పెరిగాయి.తాజాగా గడిచిన 24 గంటల్లో 9,597 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడి , 1,61,425 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 90,425 యాక్టివ్ కేసులున్నాయి.

అలాగే గత 24 గంటల్లో ఏకంగా మరో 93 మంది కరొనతో మరణించారు. ఇప్పటి వరకు 2,296 మంది మరణించారు. తాజాగా గుంటూరు లో 13 మంది, ప్రకాశంలో 11, చిత్తూరులో 10 మంది, నెల్లూరులో 10 మంది, శ్రీకాకుళంలో 9 మంది, అనంతపురంలో 7 మంది , కడపలో 7 మంది, విశాఖపట్టణంలో 6 మంది , తూర్పుగోదావరిలో 5 మంది, విజయనగరంలో 5 మంది , కర్నూలులో 4 మంది , పశ్చిమ గోదావరిలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు మరణించారు. ఇక కరోనా టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 57,148 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 26,49,767 మందికి కరోనా పరీక్షలు చేశారు.
Tags:    

Similar News