ఆంధ్రప్రదేశ్ లో కరోనాకు కల్లెం పడడం లేదు. కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,004 మందికి కరోనా సోకగా.. ఒక్కరోజులోనే 85మంది మృత్యువాత పడుతున్నారు.
తాజా కేసులో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏపీలో 4,34,771కు చేరింది. నిన్న ఏకంగా 56490 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఏపీలో కరోనా మరణాలు భారీగా నమోదుకావడం ఆందోళనకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 85 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3969కు పెరిగింది.
కరోనా మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో నెల్లూరులో 12మంది, చిత్తూరులో 9, ప్రకాశంలో 9మంది చనిపోయారు.
ఇక గడిచిన 24 గంటల్లో 8772మంది కరోనా మహమ్మారి కారణంగా పూర్తిగా జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 100276 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే 59వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో ఇప్పటివరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 59403మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలోనే అత్యధికంగా 1383 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.