ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు ... కొత్తగా ఎన్ని కేసులంటే ?

Update: 2020-10-27 16:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత కొన్నిరోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నిన్న 1901 కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో నమోదు అయిన కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య 2901. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,7900 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,300 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6625కి చేరింది. ఇక ఇదిలా ఉంటె, ఏపీలోని జిల్లాల్లో నమోదైన కేసుల్ని ఒకసారి చూస్తే ... అనంతపూర్ లో 153, చిత్తూరులో 272, తూర్పు గోదావరిలో 464, గుంటూరులో 385, కడపలో 127, కృష్ణాలో 411, కర్నూలులో 55, నెల్లూరులో 76, ప్రకాశంలో 153, శ్రీకాకుళంలో 73, విశాఖపట్నంలో 106, విజయనగరంలో 71, పశ్చిమగోదావరి జిల్లాలో 555 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో కడప జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, గుంటూరులో ఒకరు, కర్నూలులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృత్యువాత పడ్డారు.అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు కూడా స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 4,352 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Tags:    

Similar News