ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది.. వారం పది రోజులుగా ఆరువేల కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య తగ్గించినప్పటికీ వైరస్ కేసులు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 4622 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 72082 టెస్టులు చేయగా 4వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో కరోనా కేసులు 763573 కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా బారినపడి 35మంది మరణించారు.దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6291కు పెరిగింది.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 7 మంది, కృష్ణాలో 5, కడప, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున మరణించారు.
ఇక ఏపీలో ఒక్కరోజు వ్యవధిలో 5715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 711532కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 42855 యాక్టివ్ కేసులు ఉన్నాయి.