అవినీతి అక్రమాలు అన్నవి మన దేశానికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని అంతర్జాతీయ పాత్రికేయుల కన్సార్టియం సమిష్టిగా పని చేసి.. సంచలన అంశాల్ని బయటకు తీసుకురావటం తెలిసిందే. ఐదేళ్ల క్రితం పనామా పేపర్లతో భారీ షాకిచ్చిన ఈ టీం.. తాజాగా పాండోరా పేపర్స్ పేరుతో.. అంతకు మించి అన్న రీతిలో పలువురు ప్రముఖుల్ని బోనులోకి ఎక్కించే ప్రయత్నం చేశారని చెప్పాలి.
తాజాగా వెల్లడైన పత్రాల్ని చూసినప్పుడు అంతర్జాతీయంగా పలువురు ప్రముఖుల పేర్లు ఈ పత్రాల్లో దర్శనమిచ్చాయి. అంతేకాదు.. వారు చేసిన ఎదవ పనులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా తేల్చారు. భారత దేశానికి చెందిన దాదాపు 330 మందికి పైగా ఘనులు ఉండగా.. ఇప్పటికైతే అనిల్ అంబానీ.. నీరవ్ మోడీ పేర్లు బయటకు వచ్చాయి. వీరితో పాటు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. బయోకాన్ మజుందర్ షా భర్త ఉన్నట్లుగా సమాచారం. ఇక.. అంతర్జాతీయంగా ఎవరెవరి భాగోతాలు బయటకు వచ్చాయన్నది చూస్తే షాకింగ్ కలుగక మానదు.
పాండోరా పేపర్స్ బయటపెట్టిన అంతర్జాతీయ ఉల్లం‘ఘనుల’ వివరాల్ని చూస్తే..
- రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మొనాకాలోని కొన్ని ఆస్తులతో సంబంధాలు ఉన్నాయి. అయితే.. ఆయన పేరును నేరుగా ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. అయితే.. ఆయన చిన్ననాటి స్నేహితుల పేర్లతో పాటు అనధికార మంత్రిగా వ్యవహరించిన నేతతో పాటు మాజీ ప్రేయసి తదితరుల కొందరి సన్నిహితుల పేర్లు ఇందులో ఉన్నాయి.
- బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్.. ఆయన సతీమణి కలిసి తమ లండన్ ఆఫీసును కొనుగోలు చేసిన వేళలో దొడ్డి దారిన రూ.3.14 కోట్ల స్టాంపు డ్యూటీ ప్రయోజనం పొందారు.
- పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ మంత్రివర్గంలోని మంత్రులు.. వారి కుటుంబాలు ప్రధానికి సన్నిహితంగా ఉండే కొందరు కలిసి రహస్యంగా కంపెనీలు..ట్రస్టులు పెట్టి కోట్లాది రూపాయిలు కొల్లగొట్టారు. వీరిలో ఆర్థిక మంత్రి సౌకత్ తారిన్.. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. అంతేకాదు ఇమ్రాన్ మాజీ సలహాదారు వకార్ మసూద్ ఖాన్ కొడుకుతో సహా మొత్తం 700 మంది పాకిస్థానీయులు ఉండటం గమనార్హం.
- జోర్డాన్ రాడు అబ్దుల్లా 2కు అమెరికా.. బ్రిటన్ లలో రహస్యంగా సుమారు రూ.741 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారు. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లోని మాలిబులో సముద్రం ఒడ్డున నిర్మించిన విలాసవంతమైన భవనాలు ఆయనకున్నాయి.
- అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ.. అమెరికాలోని అతి పెద్ద న్యాయసేవల సంస్థ మెకెంజీ లాంటి సంస్థల లావాదేవీలను గురించి ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు.
- ఉక్రెయిన్.. కెన్యా.. ఈక్వెడార్ దేశాల అధ్యక్షులు.. చెక్ రిపబ్లిక్ ప్రధాని.. లెబనాన్ ప్రధాని.. ఆ దేశ మాజీ ప్రధాని హసన్ డయబ్.. మాజీ మంత్రి మర్వన్ ఖేర్డిన్ పేర్లు ఉన్నాయి.
- పాప్ గాయని ప్రముఖ సెలబ్రిటీ షకీరా.. మోడల్ క్లాడియా షిఫెర్ తదితరుల పేర్లు ఉన్నాయి.