భోపాల్‌ లో ఘోరం: స్పృహ కోల్పోయి రోడ్డుపై వైద్య సిబ్బంది

Update: 2020-05-31 11:12 GMT
వైర‌స్ మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడే వారిలో వైద్యులు, వైద్య సిబ్బంది కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వారిని కంటికి రెప్ప‌లా కాపాడుకోవాలి. ఇప్ప‌టికే వారికి స‌రైన సౌక‌ర్యాలు లేవు. అయినా అతిక‌ష్ట‌మ్మీద వారు ప‌ని చేస్తున్నారు. మ‌హ‌మ్మారి నుంచి కాపాడే యోధులుగా భావిస్తున్నాం. ఇలాంటి వారిని కాపాడుకోవాల్సింది పోయి కొంద‌రు నిర్ల‌క్ష్యం వ‌హించారు. వైద్య సిబ్బంది అప‌స్మార‌క స్థితికి చేరుకుని రోడ్డుపై ప‌డి ఉండ‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేని దుస్థితి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో చోటుచేసుకుంది. మ‌హ‌మ్మారి వైర‌స్ నివార‌ణ‌కు ప‌ని చేస్తున్న సిబ్బంది అక‌స్మాత్తుగా ప‌డిపోయారు. అయితే వారిలో  ఎవ‌రూ ప‌ట్టించుకోలేక‌పోయిన ఘోరంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌ లోని సాగర్ జిల్లాలోని టీవీ ఆస్ప‌త్రిలో పారామెడిక‌ల్ సిబ్బంది వైర‌స్ బాధితుల‌కు చికిత్స అందిస్తున్నారు. ఈక్ర‌మంలో చికిత్స అందించిన అనంత‌రం కొద్దిసేప‌టికి పీపీఈ కిట్ల‌తో ఇద్ద‌రు పారామెడిక‌ల్ సిబ్బంది బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే ఉన్న‌ట్టుంది వారు రోడ్డుపై ప‌డిపోయారు. అప‌స్మార‌క స్థితికి చేరుకోవ‌డంతో వారు స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. దీన్ని చూసి ఎవ‌రూ స్పందించ‌లేదు. దాదాపు అర్ధ‌గంట‌కు పైగా రోడ్డుపై వారిద్ద‌రూ ప‌డి ఉన్నారు. దీన్ని ప‌రిశీలించిన ఆస్ప‌త్రి సిబ్బంది - అధికారులు వెంట‌నే వారిని బుందేల్‌ ఖండ్‌ లోని వైద్య క‌ళాశాల‌కు తరలించారు. ఈ దారుణ ఘ‌ట‌న అంద‌రినీ క‌ల‌వ‌రం రేపుతోంది. దీనిపై వైద్యులు - వైద్య సిబ్బంది ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ప్రాణాలు తెగించి వైర‌స్ బాధితుల‌ను కాపాడుతుంటే త‌మ‌కు ఏమైనా అయితే ఎవ‌రూ ప‌ట్టించుకోరా అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి త‌మ‌కు వ‌స్తుంద‌ని అనుకోలేద‌ని పేర్కొంటున్నారు.



Tags:    

Similar News