కోవిడ్-19 ఆలస్యంతో భారీ న‌ష్టం.. ఇన్సూరెన్స్ పై కోర్టుకు నిర్మాత‌లు!

Update: 2022-07-30 05:30 GMT
కోవిడ్-19 క‌ల్లోలం గురించి తెలిసిందే. 2020-21 సీజ‌న్ లో కరోనా భీభ‌త్స‌వంతో ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే సినీపరిశ్ర‌మ‌లన్నీ మూత పడ్డాయి. అయితే ఏ ఇత‌ర రంగంతో పోల్చినా సినిమా రంగం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. కొన్ని భారీ సినిమాలు సెట్స్ లో ఉన్నా ప‌దే ప‌దే వాయిదాలు వేయాల్సి వ‌చ్చింది. ఇదే కేట‌గిరీలో టామ్ క్రూజ్ నటించిన మిషన్: ఇంపాజిబుల్ 7 షూటింగ్ ప‌ది సార్లు వాయిదా ప‌డింది.  అయితే కోవిడ్ 19 స‌మ‌యంలో త‌మ‌కు భారీ న‌ష్టం జ‌రిగింద‌ని దానికి బీమా చెల్లించాల‌ని ఫెడ‌ర‌ల్ ఇన్యూరెన్స్ వారిపై మిష‌న్ ఇంపాజిబుల్ నిర్మాత‌లు దావా వేయ‌డం సంచ‌ల‌న‌మైంది. అయితే బీమా దావాను ప్ర‌ఖ్యాత‌ పారామౌంట్ కి చెందిన ప్ర‌తినిధి ఒక‌రు తాజాగా ఇరువురి న‌డుమా మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో పరిష్కరించింది

మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్-1 పదేపదే కోవిడ్-19 కార‌ణంగా షూటింగ్ ఆలస్యమైంది. దీనివ‌ల్ల ఉత్పన్నమయ్యే క్లెయిమ్ లపై ఫెడరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో దావాలో తాత్కాలిక పరిష్కారానికి పారామౌంట్ కొత్త దారి చూపింది. ప్ర‌ముఖ ఆంగ్ల మ్యాగ‌జైన్ ప్ర‌కారం.. ఈ సెటిల్‌మెంట్ కోసం ఫ్రేమ్ వర్క్  జ‌రిగింది. మధ్యవర్తిత్వ గడువు కంటే ముందే చెల్లించేందుకు కూడా అంగీకారం కుదిరింది. ఆగస్ట్ 5 నాటికి సెటిల్ మెంట్ ఖరారు కావచ్చని  తెలిసింది. అయితే ఈ సెటిల్ మెంట్ నిబంధనలను ఇంకా వెల్లడించలేదు. మిషన్: ఇంపాజిబుల్ ఫిల్మ్ నిర్మాణం లో షూట్ డిలే న‌ష్టాల‌కు ఫెడరల్ ఇన్సూరెన్స్ స‌ద‌రు స్టూడియోకి 100 మిలియన్ డాల‌ర్ల‌ పాలసీని ఇవ్వాల్సి ఉందని పేర్కొంటూ దావా వేసారు.

మూవీ ప్రొడ‌క్ష‌న్ ఆలస్యం కోసం కేవ‌లం 5 మిలియన్ డాల‌ర్లు చెల్లించడానికి మాత్రమే ఫెడరల్ ఇన్సూరెన్స్ అంగీకరించింది. క‌రోనా డిలే అనేది ఐదు నెలల పాటు కొనసాగిం ద‌ని.. వైర‌స్ సోకిన టీమ్ సభ్యులు తమ విధులను కొనసాగించలేకపోయారు అనేదానికి ఎటువంటి ఆధారాలు లేవని ఫెడ‌ర‌ల్ త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. ``అయినప్పటికీ వారు వైరస్ ను మిగిలిన వారికి వ్యాప్తి చేయగలరు. తారాగణం సిబ్బంది SARS-CoV-2 బారిన పడినప్పటికీ  షూటింగ్ లో పాల్గొన్న ఇతర వ్యక్తులకు ప్రమాదం ఉన్నప్పటికీ నటీనటులు సిబ్బంది తమ విధులను కొనసాగించలేరని ఎటువంటి ఆధారాలు లేవని ఫెడరల్ త‌మ వాద‌న‌లో పేర్కొందని తెలిసింది.

నిర్మాణ సమయంలో దర్శకుడు లేదా చిత్ర తారలలో ఒకరు అనారోగ్యానికి గురైతే లేదా మరణిస్తే భారీ ఖర్చులు వచ్చే ప్రమాదం కారణంగా ప్రొడక్షన్స్ తారాగణం బీమాను ముందే ప్లాన్ చేస్తుంటాయి. హాలీవుడ్ లో ఇది చాలా కాలంగా కొన‌సాగుతున్న‌దే. కీల‌క స‌భ్యులు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు షట్ డౌన్ ల‌ను ఉద్దేశించబడినందున తారాగ‌ణానికి క‌చ్ఛితంగా బీమా పాలసీని ప్రారంభించి ఉండాలనే వైఖరిని పారామౌంట్ అనుస‌రిస్తోంది. పారామౌంట్  క్లెయిమ్ లకు ప్రతిస్పందిస్తూ ఫెడరల్ విధానం గురించి వాద‌న సాగింది. ప్ర‌భుత్వ ఆదేశాల కారణంగా ప్రొడక్షన్ లు మూసివేసారు.

సివిల్ అథారిటీ నిబంధనను ప్రేరేపించే చ‌ట్ట‌మిది. కానీ మా ఇన్యూరెన్స్  సాధారణంగా అల్లర్లు లేదా తుఫానుల వంటి సంఘటనలను కవర్ చేయడానికి ఉద్దేశించబడింది.. అని వాదించారు. అయితే ఎట్ట‌కేల‌కు మధ్యవర్తిత్వ గడువు కంటే ముందే సెటిల్మెంట్ కుదిరిందని తెలిసింది.

మిషన్: ఇంపాజిబుల్ 7 చిత్రం రిలీజ్ డేట్ మారింది. 14 జూలై  2023న విడుదలకు సిద్ధమ‌వుతుంద‌ని తెలిసింది. వాస్త‌వానికి ఈ డేట్ షెడ్యూల్ కి రెండేళ్లు డిలే. మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం ప్రారంభ కాలంలోనే.. అంటే ఫిబ్రవరి 2020లో ఈ మూవీ షూటింగ్  ప్రారంభమైంది. చివరకు ఏడుసార్లు షూటింగ్ ని నిలిపివేయాల్సి వచ్చింది. దానికి బీమా వ్య‌వ‌హారంలో ర‌చ్చ కొన‌సాగింది.
Tags:    

Similar News