మైన‌ర్ల డ్రైవింగ్...26మంది పేరెంట్స్ అరెస్టు!

Update: 2018-04-27 10:01 GMT
హైద‌రాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ త‌ప్ప‌తాగి వాహ‌నాలు న‌డుపుతోన్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గ‌త వారం ఊటుగా మ‌ద్యం సేవించిన ఇంజ‌నీరింగ్ విద్యార్థిని....పుట్ పాత్ పైకి కారున‌డప‌డంతో ఓ వ్య‌క్తి మృతిచెందాడు. ఈ త‌ర‌హా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల‌తో పాటు ....మైన‌ర్లు వాహ‌నాలు న‌డ‌ప‌డం కూడా ఎక్కువైంది. దీంతో, ట్రాఫిక్ పోలీసులు మైనర్ల‌పైనే కాకుండా వారి త‌ల్లిదండ్రుల‌పైన కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దాంతో పాటు వారంద‌రికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మైన‌ర్లు వాహ‌నాలు న‌డ‌పడం వ‌ల్ల జ‌రిగే అన‌ర్థాల‌ను వారికి, వారి త‌ల్లిదండ్రుల‌కు వివ‌రిస్తున్నారు. గ‌త నెల‌లో 20 మంది త‌ల్లిదండ్రుల‌పై కేసు న‌మోద‌వ‌గా - ఈ నెల‌లో ఇప్ప‌టికి ఆరుగురిపై కేసు న‌మోదైంది. వారంద‌రినీ ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు.

హైద‌రాబాద్ లో మైన‌ర్లు వాహ‌నాలు న‌డిపే సంస్కృతి ఎక్కువైపోతుండ‌డంతో ట్రాఫిక్ పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. టూవీల‌ర్లు - ఫోర్ వీల‌ర్లు న‌డుపుతూ మైన‌ర్లు ప‌ట్టుబ‌డ‌డంతో వారి త‌ల్లిదండ్రుల‌పై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేస్తున్నారు. ఒక కేసులో అయితే, ఆ మైన‌ర్ కు కూడా నెల రోజుల పాటు శిక్ష విధించారు. ఇంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నప్ప‌టికీ ...మైన‌ర్లు వాహ‌నాలు న‌డ‌ప‌డం ఆప‌డం లేదు. వారిపై త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ కూడా లోపించ‌డంతో త‌రచూ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. దీంతో, వాటిని నివారించ‌డం కోసం వారి త‌ల్లిదండ్రులతో స‌హా మైన‌ర్ల‌పై కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ, ఈ ప్ర‌మాదాలను నివారించ‌లేక‌పోవ‌డం పోలీసుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. మైన‌ర్ల‌కు వాహ‌నాలు ఇవ్వ‌కుండా త‌ల్లిదండ్రులు నిబ‌ద్ధ‌త‌తో ఉండాలని పోలీసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News