ఇది వరకూ రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైనా.. ఆ రెండు సార్లూ ఇండిపెండెంట్ గానే ఎన్నికయ్యాడట పరిమల్ నత్వానీ. సాధారణంగా రాజ్యసభకు ఇండిపెండెంట్ గా ఎన్నిక కావడం అంటూ ఉండదు. ఏదో ఒక రాష్ట్ర అసెంబ్లీ కోటా నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలి, లేదంటే రాష్ట్రపతి నామినేషన్ ద్వారా సభ్యత్వం పొందాలి. వ్యాపారవేత్తలను రాష్ట్రపతి నామినేట్ చేసే అవకాశాలు దాదాపుగా ఉండవు. మరి ఇది వరకూ కొంతమంది వ్యాపారవేత్తలు ఏదో ఒక పార్టీ బలంతో, ఏదో ఒక రాష్ట్ర అసెంబ్లీ కోటా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. అయితే వారు ఆ పార్టీ సభ్యత్వం తీసుకోరు. తద్వారా ఇండిపెండెంట్ అనిపించుకుంటారు.
పరమళ్ నత్వానీ కూడా అదే రీతిన నెగ్గుకువచ్చారని తెలుస్తోంది. ముకేష్ అంబానీకి సన్నిహితుడాయె. కాబట్టి.. ఏ పార్టీ అయినా నత్వానీ లాంటి వాళ్లను కళ్లకు అద్దుకుని తమ పార్టీ సభ్యత్వం అక్కర్లేకున్నా రాజ్యసభకు పంపిస్తూ ఉంటుంది. అలా రెండు సార్లు నత్వానీ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈ సారి ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. అయితే ఇది వరకూ నత్వానీకి వేరే పార్టీలు ఇచ్చిన రీతిన జగన్ అవకాశం ఇవ్వలేదు. ఇండిపెండెంట్ గా అంటూ అంబానీ ప్రతిపాదించినా, జగన్ దానికి సమ్మతించలేదని తెలుస్తోంది.
ఇండిపెండెంట్ కు అవకాశం ఇచ్చేది లేదని, తమ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, తమ పార్టీ తరఫునే రాజ్యసభలో ఎంట్రీ ఇస్తే.. ఓకే అని జగన్ అంబానీకే షరతు పెట్టేసినట్టుగా తెలుస్తోంది. దీని వల్ల వైసీపీకి కొన్ని లాభాలున్నాయి. సభలో తమ నంబర్ తమకు నిలబడుతుంది. రేపు ఏదైనా కీలక బిల్లులు వచ్చినప్పుడు నత్వానీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ కు కట్టుబడాల్సి ఉంటుంది. అందుకే తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే ఆయనను రాజ్యసభ కు పంపుతామని జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు నత్వానీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
నామినేషన్ దాఖలు చేయడానికి ముందే.. మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను వేయించుకున్నారు. తద్వారా ఆయన రాజ్యసభ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగబోతూ ఉన్నారు. ఇది వరకటిలా ఇండిపెండెంట్ అనే లెక్కలో కాకుండా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, ఏపీ అసెంబ్లీ కోటాలో ఎన్నికైన సభ్యుడిగా ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది. కోరింది ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేష్ అంబానీ లాంటి వాళ్లు అయినా... జగన్ మాత్రం తన షరతులను వర్తింపజేస్తూనే వారి రికమెండేషన్ కు ఓకే చెప్పి తనదైన రాజకీయ చాణక్యాన్ని కనబరిచారు.