ఇప్పుడేదో 14వ ఆర్ధిక సంఘం పేరు చెప్పి ప్రత్యేక హోదా అనే అంశంపై తప్పించుకుంటున్నారు కానీ.. ఈ విషయంపై ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని టీడీపీ సౌజన్యంతో బీజేపీ ఎప్పుడో నిర్ణయించేసుకుందా? ఇవ్వాలనుకుంటే 2014లోనే ఇవ్వొచ్చు కదా? ఈ విషయాలపై బీజేపీ - టీడీపీలపై విమర్శలు చేస్తూనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వైకాపా అధికార ప్రతినిధి పార్థసారధి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు విజయవాడలో బీజేపీ - టీడీపీ పార్టీలు ఘనంగా సన్మానం చేసిన సందర్భంగా మాట్లాడిన పార్థసారధి... ప్రజల ఆకాంక్షను, ప్రత్యేక హోదాను దిగ్విజయంగా చంపేసినందుకా? వెంకయ్యకు ఈ సన్మానాలు, టీడీపీ చేస్తున్న ఈ సంభరాలు అని ప్రశ్నించారు.
అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే అంశం ఈ నాటిది కాదని, 2014 సమయంలోనే బీజేపీ ఒక క్లారిటీకి వచ్చేసిందని చెబుతున్నారు. నీతిఆయోగ్ వచ్చింది 2014 డిసెంబర్ లో.. 14వ ఆర్థికసంఘం వచ్చింది 2015 మార్చిలో.. ఏడు నెలలపాటు ప్రత్యేకహోదా ఊసెత్తకుండా టీడీపీ - బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయి అని ప్రశ్నించిన ఆయన.. బీజేపీ - టీడీపీ లు ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వవనే విషయం నాడే ప్లాన్ చేసుకున్నాయని చెప్పారు. మేకలు - గొర్రెల మెడల్లో వేలాడే వాటితో ఏపీ ప్రత్యేక హోదాను పోల్చడం దుర్మార్గమని... నిజంగా హోదా అలాంటిదే అయితే.. అది చూపించే ఎన్నికల్లో ఎందుకు వాగ్ధానం చేసారు, మేనిపెస్టోలో ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలను నమ్మకద్రోహం చేసినందుకా.. ప్రత్యేక హోదాను చంపినందుకా.. వెంకయ్యకు సన్మానం అని ఆయన ప్రశ్నించారు. తనకున్న భాషా పరిజ్ఞానంతో, ప్రాసలతో సుదీర్ఘ ప్రసంగం చేశారే తప్ప ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేమిటో వెంకయ్య చెప్పలేదని, వేరేరాష్ట్రం నుంచి ఎన్నికైనా కూడా సొంత రాష్ట్రమైన ఏపీకి ఏదో చేద్దామనుకుంటున్నానని చెప్పాల్సిన పనిలేదని.. తెలుగుప్రజలు ఆయన దయాదాక్షిణ్యాలమీద ఏమీలేరని పార్థ సారధి ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా... ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ నేతలు చెప్పుకుంటే కాస్తయినా ప్రజలు క్షమిస్తారేమో కానీ, అసలు హోదా అనేది పెద్ద విలువైనదేమీ కాదని, అది ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఉండదనేలా మాట్లాడటం మాత్రం ఏ ఆంధ్రుడూ సహించలేకపోతున్నారనేది గ్రహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.