చంద్రబాబుపై పార్థసారథి ఫైర్

Update: 2016-10-12 09:52 GMT
హైదరాబాద్ లో రూ.10 వేల కోట్లను స్వచ్ఛంద నల్లధన పథకంలో వెల్లడించిన వ్యక్తి ఎవరంటూ జగన్ పై అనుమానపు బాణాలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైపీపీ నేత - మాజీ మంత్రి పార్థసారథి గట్టి కౌంటరేశారు.  దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే, దేశంలోనే అత్యంత ధనికుడైన మంత్రి ఆయన క్యాబినెట్ లోని నారాయణ అని ఆయన అన్నారు.  చంద్రబాబు - నారాయణ కంటే నల్లధనవంతులు ఎవరూ లేరని పార్థసారథి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  

కేంద్రం ఇచ్చిన పధకం ప్రకారం నల్లధనం వివరాలు అత్యంత రహస్యం అని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి చెప్పారని, కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కూడా జైట్లీ చెప్పారని గుర్తుచేశారు. 10 వేల కోట్లు వెల్లడించింది ఎవరు? అంటూ చంద్రబాబు పరోక్షంగా విమర్శలు చేస్తుంటే ఏపీ మంత్రి దేవినేని ఉమ మాత్రం  అది జగనేనంటూ దుష్ప్రచారం చేశారని పార్థసారథి ఆరోపించారు.  

అదే సమయంలో చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబుకు - టిడిపికి నీతి - నిజాయితి  ఉంటే నల్లధనం పై వివరాలు బయటపెట్టాలని పార్దసారధి సవాల్ చేశారు. చంద్రబాబు నిత్యం అబద్దపు ప్రచారం చేస్తున్నారని.. గత ఎన్నికలలో అబద్ధాలతో లబ్ది పొందిన ఆయన ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారని  అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News