వైఎస్సార్ హఠాన్మరణం తరువాతనే తెలుగు రాజకీయాల్లోకి జగన్ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి ఆయన కేవలం మూడు నెలల ఎంపీ మాత్రమే. వైఎస్సార్ ప్లేస్ లో జగన్ ని సోనియా గాంధీ ముఖ్యమంత్రిని చేయలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ లో ఉంటూనే ఓదార్పు యాత్ర చేశారు.అలా తనకు జనాల్లో ఉన్న ఆదరణను చూసుకుని సొంతంగా పార్టీ పెట్టి మరీ కడప లోక్ సభ ఉప ఎన్నికలకు వెళ్లారు. నాడు జగన్ కి అయిదు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ దక్కింది. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా జగన్ కాంగ్రెస్ నుంచి వచ్చి తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఇక ఉమ్మడి ఏపీ రెండుగా చీలింది. ఈ సమయంలో ఏపీలో వైసీపీ కచ్చితంగా గెలుస్తుంది అన్న లెక్కలు ఉన్నాయి. అయితే అవతల వైపు పొత్తుల కారణంగా జగన్ కి 67 సీట్లు దక్కాయి. అయినా అది కూడా మంచి నంబరే. పైగా కేవలం టీడీపీ కూటమి కంటే అయిదు లక్షల ఓట్లు మాత్రమే తక్కువగా రావడం అంటే రికార్డే మరి.
ఇలా జగన్ ఇంతింతై వటుడింటే అన్నట్లుగా ఒంటరిగా వచ్చి బాగానే ఎదిగారు. రాజకీయంగా నిలదొక్కుకున్నారు. అయితే జగన్ ఇన్ని విజయాలు సాధించడం వెనక కేవలం ఆయన కృషి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది తెర ముందు వెనకా కూడా కీలకమైన భూమిక పోషించారు. వైఎస్సార్ సతీమణిగా ఉమ్మడి ఏపీలో జనాల మధ్యకు వచ్చిన వైఎస్ విజయమ్మ జగన్ రాజకీయానికి ఎంతగానో సహకరించారు. అలాగే చెల్లెలు షర్మిల అయితే జగన్ బాణంగా జనం ముందుకు వచ్చి నాడు చంద్రబాబుతో పోటీగా వేల కిలోమీటర్ల పాదయాత్రని నిర్వహించారు. అలాగే పార్టీలోని జగన్ కోసం కాంగ్రెస్ నుంచి వచ్చి అనేక త్యాగాలు చేసిన వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి, జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారిని కూడా గుర్తు చేసుకోవాలి.
ఇక వీరితో పాటు తెర వెనక బీజేపీ, కేసీయార్ వంటి వారి సహకారం వల్లనే జగన్ కి బంపర్ విక్టరీ అన్నది 2019 ఎన్నికల్లో దక్కింది అని చెప్పాల్సి ఉంటుంది. నాడు 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లను జగన్ గెలుచుకున్నారు అంటే తెర ముందూ వెనక ఎందరో పాత్రధారులు ఉన్నారనడం అక్షర సత్యం. ఇలా జగన్ ముఖ్యమంత్రి కావాలి, వైఎస్సార్ తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించాలి అన్న ఎందరో వ్యక్తులు, శక్తుల కలయికే జగన్ లభించిన అపూర్వ విజయం అని కూడా చెప్పాలి.
అయితే ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ లో మార్పు కచ్చితంగా కనిపిస్తోంది అంటున్నారు. తన కోసం కష్టపడిన చెల్లెలు షర్మిల ఇపుడు ఎక్కడ ఉంది. ఆమె వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో వైసీపీ పక్షాన అసలు కనిపించదు అన్నది నిర్వివాద అంశం. ఇక జగన్ తల్లి విజయమ్మ కూడా షర్మిల వైపే వెళ్ళిపోయారు అంటున్నారు. జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తీసుకుంటే ఆయన పార్టీ పునాదుల నుంచి ఎంతో కష్టపడినవారుగా చూస్తారు. మరి ఆయనకు వైసీపీలో న్యాయం జరిగిందా అంటే లేదు అన్న మాటే వస్తుంది. వైవీని కేవలం టీటీడీ చైర్మన్ కే పరిమితం చేశారు. మరో వైపు బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకుంటే జగన్ కోసం ఆయన ఎన్నో సార్లు రాజీనామ చేశారు. తన మంత్రి పదవికి కాంగ్రెస్ లో రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.ఎమ్మెల్యే పదవికి కూడా ఒకసారి రాజీనమా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.
మరో వైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీసుకుంటే ఆయన కూడా అంతే. ఆయన కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేత. కేవలం జగన్ కోసం బయటకు వచ్చారు. వైసీపీ పటిష్టత కోసం ఎంతో కష్టపడ్డారు. అటువంటి వారికి మంత్రి పదవులు విస్తరణలో పోతాయి అంటున్నారు. అదే నిజం అయితే ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో కచ్చితంగా వైసీపీకి దెబ్బ పడుతుంది అంటున్నారు. సీనియర్ల సేవలకు కూడా ప్రభుత్వానికి అందకుండా పోతాయని అంటున్నారు.
ఇక జగన్ నమ్ముకున్న వారిలో సజ్జల రామక్రిష్ణా రెడ్డి విజయసాయిరెడ్డి వంటి వారు ఉన్నారు. అయితే వీరిద్దరికీ రాజకీయ అనుభవం ఏ మాత్రం లేదు, ప్రజలతో అసలు పరిచయం లేదు. నేరుగా సంబంధాలు లేవు. అంతేకాదు, క్షేత్ర స్థాయిలో వారికి ఎలాంటి పలుకుబడి లేదు అంటారు. అయినా వైసీపీలో వారికి విలువా గౌరవం దక్కుతున్నాయి అంటే కేవలం జగన్ని చూసి మాత్రమే అని చెప్పకతప్పదు. మరి అలాంటి నాయకులను ముందుకు పెట్టుకుని వెళ్తారా అన్న చర్చ అయితే పార్టీలో ఉంది.
ఇక కేసీయార్, బీజేపీ కూడా జగన్ సీఎం కావడానికి ఎంతో కృషి చేశాయన్నది చెప్పుకుంటారు. మరి రేపటి ఎన్నికల్లో వీరి మద్దతు జగన్ కి గతంలో మాదిరిగా లభిస్తుందా అంటే లేదు అనే జవాబు వస్తుంది. ఇక సోషల్ మీడియా జగన్ అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడింది. అయితే మెయిన్ స్ట్రీం మీడియాతో పాటు సోషల్ మీడియా సైతం జగన్ మీద గుర్రుగా ఉందని అంటున్నారు. ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే జగన్ కి మిగిలేది ఆయన సతీమణి భారతి మాత్రమే. మరి ఆమెకు రాజకీయంగా అనుభవం ఏమీ పెద్దగా లేదు.
జగన్ గతంలో చేసినట్లుగా పాదయాత్ర చేయడానికి ఇపుడు కుదిరే వ్యవహారం కానే కాదు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో జగన్ చేసేది హెలికాప్టర్ యాత్ర మాత్రమే. మరి అలా చేస్తే నాడు చంద్రబాబుకు వచ్చిన పరిస్థితే జగన్ కి కూడా రావచ్చు అంటున్నారు. మరి జగన్ ఇప్పటి నుంచే ప్రతీ జిల్లాకు వెళ్ళి పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పూర్తిగా అర్ధం చేసుకుని అంచనాకు రావాలని సూచనలు అందుతున్నాయి.
మరో వైపు చూస్తే పీకే టీమ్ ని వైసీపీ ఎమ్మెల్యేలే రానీయడం లేదు అంటున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో టీడీపీ జనసేన కలసి పోటీ చేస్తే కమ్మ, కాపు సామాజిక వర్గంతో పాటు, బీసీలు కూడా ఆ కూటమి వైపు వెళ్ళిపోతారు. అపుడు జగన్ పూర్తిగా ఒంటరి కావడం తప్ప చేసేది ఏమీ ఉండదని అంటున్నారు. మరి ఇక జగన్ మంత్రి వర్గ విస్త్రణ పేరిట కనుక సీనియర్లను తొలగించి కఠిన నిర్ణయం తీసుకుంటే మాత్రం పార్టీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు. 2024 ఎన్నికలకు జగన్ తో పాటు నడిచే వారు కూడా పెద్ద నాయకులు ఉండరని అంటున్నారు. ఇప్పటికే క్యాడర్ పట్టనట్లుగా ఉన్నారు. వారంతా జగన్ని సీఎం గా చూసేశాం, ఇక మా సంగతేంటి అన్న ఆలోచనలో పడ్డారు. మొత్తానికి జగన్ ఒంటరి అవుతున్నారా అన్న భావన అయితే ఉంది. ఇప్పటికైనా మించిపోయినది లేదు. జగన్ తన పార్టీని చక్కదిద్దుకుని సీనియర్లను, బలమైన నాయకులను అక్కున చేర్చుకుని ముందుకు సాగితేనే 2024 ఎన్నికల్లో విజయం దక్కుతుంది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.