రోటీన్ కు భిన్నమైన దృశ్యం దేశ పార్లమెంటులో అవిష్కృతమవుతోంది. రాష్ట్ర విభజనతో పార్లమెంటులో పలుచనైన తెలుగుదనానికి.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత ఇబ్బందిగా.. మిగిలిన వారు నవ్వుకునేలా మారాయి. సాధారణంగా.. ఒక పార్టీ ఎంపీలు.. ఇతరపార్టీ ఎంపీల మీద విరుచుకుపడటం.. ఘాటు విమర్శలు.. వ్యాఖ్యలు చేయటం.. డిమాండ్లను తెర మీదకు తీసుకురావటం జరుగుతుంది. ఇదంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఈ పోటీ ఉంటుంది.
అందుకు భిన్నంగా.. ఒకే పార్టీకి చెందిన ఎంపీలు.. తమ పార్టీ ఎంపీల మీదా.. తమ పార్టీ అధినేత మీద ఉన్న కేసుల గురించి ప్రస్తావించుకోవటం.. అనూహ్యమైన డిమాండ్లు చేసుకునే ఘనత మాత్రం వైసీపీకి మాత్రమే దక్కుతుంది.
సోమవారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఆ పార్టీకి చెందిన ఎంపీ వర్సెస్ అదే పార్టీకి చెందిన రెబల్ ఎంపీ మధ్య జరిగిన సంవాదం మిగిలిన పార్టీలు విస్తుపోయేలా చేసింది. తమ కంట్లో నలుసులా మారిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజును టార్గెట్ చేస్తూ ఇప్పటికే వైసీపీ ఎంపీలు చాలానే ప్రయత్నాలు చేశారు.
ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఇప్పటికే పలుమార్లు విఫలయత్నం చేశారు.కానీ.. ఫలితం లేకపోయింది. ఇలాంటి వేళ.. పార్టీఅధినేత జగన్ పై రఘురామ చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన్ను ఇరుకున పెట్టేందుకు ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి సరికొత్త డిమాండ్ చేశారు.
రఘురామ మీద ఉన్న సీబీఐ కేసుల్ని వేగంగా దర్యాప్తు నిర్వహించాలని ఆయన పార్లమెంటులో డిమాండ్ చేశారు. తనపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాన్ని రఘురామ అనూహ్యంగా మిథున్ రెడ్డి మీద సంధించటమేకాదు.. మిగిలిన వైసీపీ ఎంపీలు ఆత్మరక్షణలో పడేలా చేశారు.
మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన రఘరామ.. తన మీద రెండు సీబీఐ కేసులు మాత్రమే ఉన్నాయని.. కానీ తమ పార్టీ అధినేత.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వందల కేసులు ఉన్నాయని.. ముందు వాటి సంగతి తేల్చాలని ఘాటుగా రియాక్టు అయ్యారు రఘురామ.
ఇందంతా చూస్తునన వైసీపీ నేతలు మాత్రం.. మీలో మీరు కొట్లాడుకోవటం ఏమో కానీ.. అధినేతను ఇరుకున పడేస్తున్నారే? కేసుల గురించి తెలిని వారికి కూడా తెలిసేలా చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక రాష్ట్ర ఎంపీలుగా.. అది కూడా ఒకే పార్టీ ఎంపీలుగా.. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు..డిమాండ్ల సాధన మీద ఫోకస్ పెట్టుకోవాల్సింది పోయి.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు.
వీరిద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం మిగిలిన పార్టీలకు వినోదంగా మారింది. ఏపీ ఎంపీల తీరుపై వారు చర్చించుకుంటున్నారు. దీంతో.. ఒకప్పుడు ఏపీఎంపీలు అంటే మర్యాద ఉండేదని.. ఇప్పుడు అదంతా పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉన్న వైరాన్ని తీర్చుకోవాలంటే.. అందుకు చాలా వేదికలు ఉన్నాయని.. కానీ.. పార్లమెంటులో రాష్ట్రం పరువు తీసేలా వ్యవహరిస్తున్న తీరు సరికాదంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు.. రెబల్ ఎంపీ రఘురామ ఈ కోణంలోకాస్త ఆలోచిస్తారా?