ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణిస్తున్నవారు తోటి ప్రయాణికులతో ప్రవర్తిస్తున్న విధానం తీవ్ర విమర్శలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ప్రయాణికుడు మరో మహిళా ప్రయాణికురాలిపై విమానంలోనే మూత్రం పోసిన ఘటన కలకలం రేపింది. అలాగే ఒక ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ పై ఇటీవల పిడి గుద్దులతో దాడికి దిగాడు. ఈ ఘటనల్లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరిపై విమానయాన సంస్థలు విమానం ఎక్కకుండా నిషేధం విధించాయి.
తాజాగా ఇలాంటి ఘటనే పునరావృతమైంది. విమానంలో శృతి మించి మద్యం తాగి అల్లరికి పాల్పడుతున్న వ్యక్తిని వారించబోయిన ఎయిర్ హోస్టెస్ పై వేధింపులకు పాల్పడ్డ భారతీయ ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన వివరాల్లోకెళ్తే పంజాబ్ లోని జలంధర్ జిల్లా కోట్లి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్ దుబాయ్ – అమృత్ సర్ ఇండిగో విమానం ఎక్కాడు. దుబాయ్ లో విమానంలోనే అతిగా మద్యం సేవించడం, పక్కవారిని ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో ఎయిర్ హోస్టెస్ అతడికి సర్దిచెప్పడానికి ప్రయత్నించింది. దీంతో నిందితుడు రాజిందర్ సింగ్ రెచ్చిపోయాడు. ఎయిర్ హోస్టెస్ పైనే వేధింపులకు పాల్పడ్డాడు. విమాన సిబ్బంది అతడిని వారించడానికి ప్రయత్నించినా వినకపోగా మరింత రెచ్చిపోయాడు. ఆమె పై అసభ్య వ్యాఖ్యలు చే యడంతోపాటు దాడికి ప్రయత్నించాడు. విమానం క్యాబిన్ సిబ్బందిపైనా పెద్దగా అరుస్తూ రభస సృష్టించాడు.
విమానం అమృత్ సర్ కు చేరుకున్నాక విమాన సిబ్బంది రాజిందర్ సింగ్ పై విమానాశ్రయం కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అమృత్ సర్ లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సెక్యూరిటీ అధికారి అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. అలాగే ఎయిర్ హోస్టెస్ ను కించపరచడం, దాడికి ప్రయత్నించడం, నేరపూరిత బలవంతం, అసభ్య సంజ్ఞలు చేయడం వంటి వాటిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అమృత్ సర్‌లో విమానం దిగినప్పుడు రాజిందర్ సింగ్ ను అరెస్టు చేశారు.అతడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.