జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది నిర్వాకం కారణంగా ప్రయాణికులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి ముక్కు - చెవుల నుంచి రక్తస్రావం జరిగిన ఘటన సంచలనమైంది. దాదాపు 30 మంది ప్రయాణికులు ఇలా ఆపసోపాలు పడిన ఫొటోలు - వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న విమానంలో ఈ దారుణం జరిగింది. ప్రయాణికుల ఆర్తనాదాలతో విమానం జైపూర్ వెళ్లకుండానే తిరిగి ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చేసింది. జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇంత మంది బాధపడ్డారు.
గాల్లోకి ఎగిరాక విమానంలో ఒత్తిడి తగ్గించే బటన్ ను సిబ్బంది ఆన్ చేయలేదు. దీంతో 30 మందికి తీవ్ర రక్తస్రావమైంది. మరికొంతమందికి తలనొప్పి అని చెప్పడంతో ఆక్సిజన్ మాస్కులు తొడిగారు.
విమానంలో ప్రయాణించినప్పుడు ఒత్తిడి ఏర్పడకుండా ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందిస్తారు. విమానం పైకి వెళ్తుంటే ఈ ఒత్తిడిని తగ్గించేందుకు దీనిని ఆన్ చేయాల్సి ఉంటుంది. అలా ఒత్తిడి లేకుండా చేస్తేనే ఊపిరి తీసుకోవడానికి సులభమవుతుంది. కానీ విమాన సిబ్బంది ఆ బటన్ నొక్కలేదు. దీంతో పైకి వెళ్లిన కొద్ది తక్కువ గాలి.. తక్కువ ఆక్సిజన్ ప్రయాణికులకు అందింది. దాదాపు 18000 అడుగుల పైకి వెళ్తే వాతావరణ పీడనం 7.3 పీఎస్ ఐ కి తగ్గుతుంది. అప్పుడు తగినంత గాలి - ఆక్సిజన్ మెదడుకు అందదు. ఒత్తిడి తగ్గించే బటన్ ఆన్ చేస్తే ఆక్సిజన్ గాలి ఒత్తిడి సక్రమంగా అంది ప్రయాణికులకు ఏం కాదు.. జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది ఈ బటన్ నొక్కకపోవడంతో గాలి అందక ప్రయాణికుల ముక్కు, చెవుల నుంచి రక్తస్రావమైంది. దీనిపై విమానయాన శాఖ సదురు సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.