రైల్వే స్టేషన్ నుండి పరుగులు పెట్టిన ప్రయాణీకుల ... ఏమైందంటే , వీడియో వైరల్ ?

Update: 2021-04-17 23:30 GMT
అది ఓ సాధరణ రైల్వే స్టేషన్. నిత్యం కొన్ని రైళ్లు ఆ స్టేషన్ మీదుగా ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఎప్పటిలాగే ఆ స్టేషన్ లోకి ఓ రైలు వచ్చి ఆగింది. ఆ తర్వాత అక్కడ దిగాల్సిన వారు స్టేషన్ లో ఫ్లాట్ ఫారం పై దిగి , చిన్నగా నడుచుకుంటూ బయటకి రా సాగారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో అకస్మాత్తుగా కలకలం రేగింది. పదుల సంఖ్యలో ప్రయాణీకులు ఒక్కసారిగా పరుగులు ప్రారంభించి, స్టేషన్ బయటకు పరుగులు తీస్తూ వస్తున్నారు. వారంతా ఎదో ప్రమాదం జరిగినట్టు ఆందోళనగా ఉరుకులు తీశారు. చేతిలో లగేజీ పడిపోతున్నా.. దానిని గట్టిగా పట్టుకుని.. పిల్లలని పట్టుకొని పరుగులు తీయిస్తూ స్టేషన్ బయటకు వచ్చేశారు. అసలు వారు ఎందుకు పరుగులు తీస్తున్నారు అంటూ ఆరా తీస్తే, అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.  

ఇంతకీ ఎందుకు అంతలా పరుగులు తీసారంటే.. స్టేషన్ లో హెల్త్ వర్కర్లు కరోనా పరీక్షలు చేయించుకోమని వారిని అడిగారట. ఈ సంఘటన శుక్రవారం రాత్రి బీహార్ లోని బక్సర్ రైల్వేస్టేషన్ లో చోటుచేసుకుంది. ఈ ప్రయాణీకులు ఇలా బయటకు పరిగెత్తుకు రావడం వీడియో తీసిన ఒకరు దానిని ట్విట్టర్ లో ఉంచారు. దీంతో ఈ వీడియో ట్రేండింగ్ గా మారింది. బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల బీహార్ లోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. బీహార్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళుతుంటారు ప్రజలు. ఇప్పుడు కరోనా రెండో వేవ్ దేశవ్యాప్తంగా విరుచుకుపడుతోంది. ఈ నేపధ్యంలో అన్నిముఖ్యమైన నగరాల్లోనూ రాత్రి కర్ఫ్యూ, అదేవిధంగా పలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు.

దీనితో ఆయా ప్రాంతాలకు వలస వెళ్ళిన ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు వచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో బీహార్ నుంచి వలస వెళ్ళినవారూ తిరిగి రావడం ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అందులో భాగంగానే రైళ్ళలో తిరిగి వస్తున్న ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. బీహార్ రైల్వేస్టేషన్ లలో ఇలా జరగడం మొదటిసారి కాదనీ, దాదాపు ప్రతిరోజూ ఇలా జరుగుతూనే ఉంటుందని రైల్వే అధికారి ఒకరు ఈ సంఘటనపై  మాట్లాడారు. రైలు నుంచి దిగిన ప్రయాణీకులను కోవిడ్ టెస్ట్ చేయించుకోమని కోరాను. అయితే, వారు నాతో వాదనకు దిగారు. అక్కడ నేను ఒక్కదానినే ఉన్నాను. వెంటనే, పోలీసుల సహాయం కోరాను అని ఆ హెల్త్ వర్కర్ చెప్పారు. బీహార్ నుంచి ముంబాయి వలస వెళ్ళేవారు ఎక్కువ. ఇప్పుడు ముంబాయిలో కరోనా వేవ్ చాలా అధికంగా ఉంది. అక్కడ నుంచి నేరుగా రైళ్ళలో వందలాది మంది నిత్యం రాష్ట్రంలోకి తిరిగి వస్తున్నారు. వారు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించి పారిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది అని బీహార్ అధికారులు అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

https://twitter.com/manishndtv/status/1383057461821673484?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1383057461821673484|twgr^|twcon^s1_&ref_url=https://tv9telugu.com/trending/people-running-out-from-a-railway-station-in-bihar-to-avoid-corona-tests-456639.html
Tags:    

Similar News